Share News

చింతతో చింత ఏల?

ABN , Publish Date - Jul 28 , 2026 | 04:50 AM

ఈ పుల్లని పండు మన మెదడులోని ఫ్లోరైడ్‌ను శరీరం బయటకు పంపించేస్తుంది. మరిన్ని వివరాలు....

చింతతో చింత ఏల?

ఫుడ్‌ ఫ్యాక్ట్‌

ఈ పుల్లని పండు మన మెదడులోని ఫ్లోరైడ్‌ను శరీరం బయటకు పంపించేస్తుంది. మరిన్ని వివరాలు....

  • కుళాయి నీళ్లు, వంటపాత్రల ద్వారా ఫ్లోరైడ్‌ మన పినియల్‌ గ్రంథిలోకి చేరుకుని, అక్కడే నిల్వ ఉండిపోతూ ఉంటుంది. కొన్నేళ్ల వ్యవధిలో అది నిద్ర, జ్ఞాపకశక్తులను దెబ్బతీసే స్థాయికి చేరుకుంటుంది. సాధారణంగా మెదడులో పేరుకుపోయిన ఫ్లోరైడ్‌ పోస్ట్‌మార్టమ్స్‌లో బయటపడుతూ ఉంటుంది.

  • రోజుకు పది గ్రాముల చింతపండు తిన్న మగపిల్లల మూత్రంలో ఫ్లోరైడ్‌ పరిమాణం పెరిగినట్టు ఒక ప్రయోగంలో తేలింది. కేవలం చింతపండు తినడం వల్లే ఈ ఫలితం సాధ్యపడిందని శాస్త్రవేత్తలు నిర్థారించారు.

  • చింతపండులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, బి విటమిన్లు, ఫైబర్‌ కూడా ఉంటాయి. దీన్లోని ఫైబర్‌ లాక్సేటివ్‌గా ఉపయోగపడి ఫ్లోరైడ్‌ను శరీరం బయటకు పంపించేస్తుంది.

  • చింతపండులోని పాలిఫెనాల్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ను, రక్తంలోని చక్కెర మోతాదులను తగ్గిస్తాయు. హృదయస్పందనను స్థిరీకరించి, ఆకలిని కూడా అదుపులో ఉంచుతాయి.

  • తీపి, పులుపు ఈ చింతపండ్లు రెండూ ఒకే రకమైన ప్రభావాన్ని కనబరుస్తాయి. కాబట్టి వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్‌ సర్కార్‌..!

బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 04:50 AM