మొక్కలు పచ్చగా
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:48 AM
ఎండాకాలంలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ మొక్కలు వాడిపోతూ ఎండిపోతూ ఉంటాయి. అలాకాకుండా వేసవిలో...
ఎండాకాలంలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ మొక్కలు వాడిపోతూ ఎండిపోతూ ఉంటాయి. అలాకాకుండా వేసవిలో కూడా మొక్కలు పచ్చగా గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి...
రోజూ బియ్యం కడిగిన నీళ్లను ఓ ప్లాస్టిక్ డబ్బాలో పోసి ఉంచుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో ఒక గ్లాసు బియ్యం కడిగిన నీళ్లను తీసుకుని అందులో మరో గ్లాసు మామూలు నీళ్లు పోయాలి. తరువాత చెంచా బ్రూ కాఫీ పొడిని వేసి బాగా కలపాలి. ఈ నీళ్లను రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మొక్కలపై పిచికారీ చేయాలి. దీంతో అవసరమైన పోషకాలు, నైట్రోజన్ పుష్కలంగా అంది మొక్కలు చక్కగా పెరుగుతాయి.
వేసవిలో మొక్కలకు ఎక్కువగా తెగుళ్లు సోకుతుంటాయి. క్రిమి కీటకాలు కూడా చేరుతుంటాయి. అలాంటప్పుడు పాడైన, ఎండిన ఆకులను వెంటనే తొలగించాలి. అదనపు కొమ్మలను కత్తిరించాలి. కాండాన్ని పరిశీలించి తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. మొక్కలపై వేప నూనె, బేకింగ్ సోడా, పుల్లటి మజ్జిగ, షాంపూ ద్రావణాల్లో ఒకదాన్ని పిచికారీ చేయాలి. మొక్కలకు ఇలా ప్రూనింగ్ చేస్తూ ఉంటే అవి ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతాయి.
Also Read:
గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..
కష్టపడి పని చేసేవారికి అవకాశాలు పుష్కలం: నారా భువనేశ్వరి
For More Latest News