బాల్కనీ గార్డెన్ ఇలా...
ABN , Publish Date - Jun 11 , 2026 | 02:41 AM
చిన్న బాల్కనీలో కూడా ట్రెండీ గార్డెన్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో చూద్దాం...
చిన్న బాల్కనీలో కూడా ట్రెండీ గార్డెన్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో చూద్దాం...
గోడలకు అమర్చే ప్లాంటర్లు, వేలాడే కుండీలతో వర్టికల్ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తే బాల్కనీకి పచ్చదనంతోపాటు మోడరన్ లుక్ వస్తుంది. మధ్యలో చిన్న టేబుల్ దాని చుట్టూ అందమైన డిజైన్లతో కూడిన కుర్చీలు వేస్తే అహ్లాదకరంగా కనిపిస్తుంది.
బాల్కనీలో ఉడెన్ ఫ్లోర్ అలాగే రకరకాల సైజుల్లో కుండీలు పెట్టుకోవడానికి వీలుగా చెక్కతో స్టెప్స్‌ను డిజైన్ చేయవచ్చు. ఈ కుండీల్లో అలంకరణ మొక్కలు వాటి చుట్టూ అందమైన లైటింగ్‌ను ఏర్పాటు చేస్తే బాల్కనీకి లగ్జరీ రెస్టారెంట్ లుక్ వచ్చేస్తుంది. సాయంత్రం పూట ఇక్కడ కూర్చుని టీ తాగుతూ కొద్దిసేపు గడిపితే మనసుకు అహ్లాదకరంగా ఉంటుంది.
బాల్కనీలో హ్యాంగింగ్ బాస్కెట్లను ఏర్పాటు చేసి వాటిలో తీగలుగా వేలాడే మొక్కలను పెంచడం ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్న ట్రెండ్. మనీ ప్లాంట్, ఇంగ్లీష్ ఐవీ, స్పైడర్ మొక్కలు ఈ డిజైన్‌కు బాగా సూటవుతాయి. వీటివల్ల బాల్కనీ పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ కూర్చుని యోగా, ధ్యానం లాంటివి చేసుకోవచ్చు. లేదంటే కొద్దిసేపు వాకింగ్ చేసినా తాజా అనుభూతి కలుగుతుంది.
బాల్కనీలో రెయిలింగ్‌తోపాటు రెండువైపులా చిన్న కర్ర పందిళ్లను ఏర్పాటు చేసి వాటి మీదికి సువాసన భరితమైన రంగు రంగుల పూల తీగలను పాకించవచ్చు. దీంతో బాల్కనీకి చక్కని యూరోపియన్ గార్డెన్ లుక్ వస్తుంది. మధ్యలో చిన్న కేన్ అమర్చుకుంటే హాయిగా కొంతసేపు గడపవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News