మోకాళ్ల నొప్పులతో నిద్రపోయేదెలా?
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:54 AM
కీళ్లు, టెండాన్స్, లిగమెంట్ల మీద ఒత్తిడి పడకుండా చూసుకోగలిగితే మోకాళ్ల నొప్పి నుంచి తప్పించుకోవచ్చు. అందుకోసం రాత్రివేళ నిద్రపోయే సమయంలో కొన్ని...
కౌన్సెలింగ్
డాక్టర్! నా వయసు 55. గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. రాత్రి నిద్రపోయే సమయంలో మోకాళ్ల మీద ఒత్తిడి పడకుండా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
ఓ సోదరి, హైదరాబాద్.
కీళ్లు, టెండాన్స్, లిగమెంట్ల మీద ఒత్తిడి పడకుండా చూసుకోగలిగితే మోకాళ్ల నొప్పి నుంచి తప్పించుకోవచ్చు. అందుకోసం రాత్రివేళ నిద్రపోయే సమయంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటించవచ్చు. మనందరం వెల్లకిలా, బోర్లా లేదా పక్కకు ఒత్తిగిలి పడుకుంటూ ఉంటాం! ఈ భంగిమల్లో కీళ్లు, టెండాన్లు, లిగమెంట్ల మీద ఒత్తిడి పడకుండా ఉండడం కోసం మెత్తని దిండును ఉపయోగించవచ్చు. అదెలాగంటే...
వెల్లకిల: వెల్లకిల పడుకునే అలవాటున్నవారు, మోకాళ్ల అడుగున దిండును ఉంచుకోవాలి. సాధారణంగా కాళ్లు ఎత్తులో ఉంచాలనే ఆలోచనతో, పాదాల అడుగున దిండును ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ మోకాళ్ల అడుగున దిండును ఉంచుకోగలిగితే, కీళ్ల మధ్య జాగా పెరిగి, ఒత్తిడికి లోనవకుండా ఉంటాయి.
పక్కకు: ఇలా పడుకున్న భంగిమలో రెండు మోకాళ్లు ఒకదానికొకటి తగులుతూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండడం కోసం మడిచిన రెండు కాళ్ల మధ్య దిండు ఉంచుకోవాలి.
బోర్లా: ఈ భంగిమలో మోకాళ్లు నేరుగా పరుపును తాకుతూ ఉంటాయి. అయినప్పటికీ ఇలా పడుకున్నప్పుడు కూడా మోకాళ్ల దిగువన దిండు ఉంచుకుని పడుకోవాలి. దాంతో కీళ్లు ఒరుసుకుపోకుండా ఉంటాయి.
డాక్టర్ సునీల్ దాచెపల్లి
సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్
ఆర్థొపెడిక్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి:
WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ
అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!