Share News

ఇలా కూడా బరువు తగ్గొచ్చు

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:03 AM

కఠినమైన ఆహార నియమాలు పాటించకుండా, గంటల తరబడి జిమ్‌లో గడపకుండా సులువుగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే...

ఇలా కూడా బరువు తగ్గొచ్చు

కఠినమైన ఆహార నియమాలు పాటించకుండా, గంటల తరబడి జిమ్‌లో గడపకుండా సులువుగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే...

  • ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఇష్టమైన పది రకాల వంటకాలను ఓ లిస్టు రాసుకుని వాటిని ఆరోగ్యకరమైన రీతిలో మార్చి మార్చి తయారుచేసుకుంటూ చక్కగా తినవచ్చు. బయట తినాల్సివచ్చినప్పుడు తక్కువ కేలరీలు ఉండేవాటిని తింటే సరిపోతుంది. కండరాల పుష్టి కోసం ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.

  • వారానికి మూడు లేదా నాలుగుసార్లు జిమ్‌కి వెళితే చాలు. వెళ్లినప్పుడల్లా గంటకు మించి ఉండాల్సిన పనిలేదు. ఎత్తాల్సిన బరువును వారం వారం పెంచుకుంటూ రిపిటీషన్లు చేస్తూ శరీర సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అప్పర్‌ బాడీ, లోయర్‌ బాడీ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.

  • రోజూ కనీసం పదివేల అడుగులు నడిచేలా టార్గెట్‌ నిర్దేశించుకోవాలి. వారానికి రెండుసార్లు గంటసేపు వేగంగా నడవాలి.

  • రోజూ కనీసం ఎనిమిది గంటలు హాయిగా నిద్రించాలి. పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం ముగించాలి.

  • ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మొదటి నెల నాలుగు కిలోలు, మూడో నెల పదకొండు కిలోలు, ఆరోనెల 23 కిలోల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 05:03 AM