చింతపండుతో చింతలు మెండు
ABN , Publish Date - May 30 , 2026 | 01:12 AM
‘భోజన కుతూహలం’ గ్రంథంలోని ఈ శ్లోకంలో రఘునాథ సూరి చింతపండు గుణాలు వివరించాడు. వీటి లో వాతాన్ని తగ్గిస్తుందనేని ఒక్కటే మనం సంతోషించాల్సిన విషయం. అదికూడా తిన్నందువల్ల ...
భోజన కుతూహలం
చించాత్యామ్లాభ వేదామాపక్వేత్ మధురామ్లికా!
వాతఘ్నీ పిత్తదాహాస్ర కఫదోష ప్రకోపనీ!
తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అనే ఆరు రుచులు మనకు ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ రకరకాల పాళ్లలో కలగలపడం ద్వారా వందలాది రుచులు ఏర్పడతాయి. వీటిలో పులుపు చాలా ముఖ్యమైనది. పులుపు లేకపోతే కూర చెడుతుంది. పులుపు ఉంటే కడుపు చెడుతుంది... ఇదీ పరిస్థితి!
‘భోజన కుతూహలం’ గ్రంథంలోని ఈ శ్లోకంలో రఘునాథ సూరి చింతపండు గుణాలు వివరించాడు. వీటి లో వాతాన్ని తగ్గిస్తుందనేని ఒక్కటే మనం సంతోషించాల్సిన విషయం. అదికూడా తిన్నందువల్ల కలిగే మేలుగా నొక్కి చెప్పలేదు. వాతపు నొప్పులున్నచోట, వాపులున్నచోట చింతపండుని ఉడికించి వేడిగా మలాం పట్టు వేస్తారు. నొప్పి, వాపు తగ్గుతాయని! దాన్ని దృష్టిలో పెట్టుకుని వాతహరం అని చెప్పినట్టు కనిపిస్తుంది. పైత్యాన్ని, కఫాన్ని చింతపండు అనేక రకాలుగా పెంచుతుందని, ఆ దోషాలవల్ల కలిగే వ్యాధులకు తలుపులు తెరుస్తుందనీ నొక్కి చెప్పాడు.
కూర, పప్పు, పచ్చడి పులుసు, రసం, సాంబారు, పెరుగు, చల్ల... ఇదీ తెలుగువారి భోజన విధానం. ఈ పద్ధతిలో తీసుకుంటే ఆరు రుచులూ సమకూరి షడ్రసపేతమైన భోజనం అవుతుంది. ఇలా ఆయుర్వేదం చెప్పిన పద్ధతిలో భోజనం చేసే అలవాటు ఒక్క తెలుగువారికే ఉంది. తమిళులకు అన్ని రుచుల్నీ సాంబారుతో పాటుగా తీసుకునే అలవాటున్నా వారి సాంబారులో పులుపు పాళ్లు తక్కువ. మనమే వెర్రెత్తినట్టు చింతపండు వాడుతున్నాం. అలా వాడేవారి కోసమే ఈ ‘భోజన కుతూహలం’ ఈ శ్లోకాన్ని చెప్పింది. పులుసు ఒక్కదాంట్లోనే పులుపు తప్ప తక్కినవాటిలో పులుపు కలిపే అలవాటు మన పూర్వులకూ లేదు. చింతపండు కూడా పండు అనే సంగతి షుగరు రోగులు మరువకూడదు. కాకపోతే వామన, ముదురు చింతకాయలకన్నా హానికారక లక్షణాల్లో చింతపండే ఒకింత మెరుగంటాడు రఘునాథ సూరి. వేడిచేసే విషయంలో, కడుపులో ఎసిడిటీ, అల్సర్లు, అజీర్తిని పెంచటంలో చింతపండు ఏ ఇతర హానికారక ద్రవ్యాలకూ తీసిపోదంటాడు. చింతపండు మితిమీరిన వాడకం వలనే రక్తదోషాలు అనేకం ఏర్పడుతున్నాయని ‘భోజన కుతూహలం’ స్పష్టం చేస్తోంది.
వేడి చేసినా తట్టుకోగలిగిన వారు చింతపండు వాడకానికి సిద్ధపడాలి. అందులోని పీచుపదార్థాలు పొట్టకు బలాన్నిస్తాయి. పేగుల్ని వేగంగా కదిలించి విరేచనం అయ్యేలా చేస్తాయి. పరిమితంగా వాడుకుంటే చింతపండు మేలు చేస్తుంది. అది కూడా ఒక్క పులుసులో మాత్రమే. చింతపండు కన్నా చింతచిగురు అనేక రెట్లు ఉత్తమ ఔషధం.
- గంగరాజు అరుణాదేవి
చింతకాయల దశలకు అనుగుణంగా వాటి ప్రభావం కూడా మారుతుందని ఆయుర్వేదం చెబుతోంది. చింతకాయలు లేతవిగా ఉన్నవి వగరు, పులుపు కలిగి ఉంటాయి. వీటిని వామన చింతకాయలంటారు. ఇవి కఫాన్ని పెంచుతాయి. ముదురు చింతకాయలు అధిక పులుపుతో పైత్యాన్ని రెచ్చగొడతాయి. గుండె, గొంతు కండరాలు ముడుచుకుపోయేలా చేస్తాయి. పండినవి తీపి, పులుపు కలిగి ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
For More AP News And Telugu News