Share News

పొడుగ్గా కనిపించాలా..!

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:23 AM

ఎన్ని రకాల ఫ్యాషన్‌ డ్రెస్‌లు ఉన్నప్పటికీ మహిళలంతా ఇష్టపడేది మాత్రం చీరనే. ఎలాంటి ఆహార్యం ఉన్నవారికైనా చీర చక్కగా నప్పుతుంది. కానీ కాస్త ఎత్తు తక్కువగా...

పొడుగ్గా కనిపించాలా..!

ఎన్ని రకాల ఫ్యాషన్‌ డ్రెస్‌లు ఉన్నప్పటికీ మహిళలంతా ఇష్టపడేది మాత్రం చీరనే. ఎలాంటి ఆహార్యం ఉన్నవారికైనా చీర చక్కగా నప్పుతుంది. కానీ కాస్త ఎత్తు తక్కువగా ఉన్న మహిళలు మాత్రం చీర కట్టుకుంటే మరింత పొట్టిగా ఉన్నట్లు కనిపిస్తామనుకుంటూ ఉంటారు. వీళ్లు.. చీర రంగు, డిజైన్‌, ఫ్యాబ్రిక్‌ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం అందంగా ఎత్తుగా కనిపిస్తారు. అలా చీరకట్టులో ఎత్తుగా కనిపించేలా చేసే సీక్రెట్‌ టిప్స్‌ మీకోసం...

  • కొంతమంది చీర ఒక రంగులో బ్లౌజ్‌ మరో రంగులో ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఇలా కాంట్రాస్ట్‌ కలర్స్‌ ధరించడం వల్ల శరీర ఆకృతి రెండు భాగాలుగా కనిపిస్తూ పొట్టిగా ఉన్నారన్న భ్రాంతిని కలిగిస్తుంది. అలాకాకుండా చీర, బ్లౌజ్‌ ఒకే రంగులో ఉండేలా చూసుకుంటే మోనోక్రోమటిక్‌ లుక్‌ ఏర్పడి శరీరం నిలువుగా ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది.

  • పెద్ద పెద్ద అంచులతో ఉండే చీరలు... పొట్టివారికి అసలు నప్పవు. చీర బోర్డర్‌ ఎంత పెద్దగా ఉంటే అంత పొట్టిగా కనిపిస్తారు. ఇలాంటి పెద్ద బోర్డర్లు కాళ్ల వద్ద ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఎత్తును కనబడనీయవు. కాబట్టి పొట్టిగా ఉన్నామనుకునేవారు నాజూగ్గా పొడవుగా కనబడాలంటే చిన్న బోర్డర్లు లేదంటే ప్లెయిన్‌ చీరలను ఎంపిక చేసుకోవడం శ్రేయస్కరం.

  • చీర ఫ్యాబ్రిక్‌ కూడా లుక్‌ని ఎలివేట్‌ చేస్తుంది. కాటన్‌, ఆర్గంజా, హెవీ సిల్క్‌ చీరలు కట్టుకుంటే శరీరాకృతి లావుగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో మరింత పొట్టిగా ఉన్నామనే భావన కలుగుతుంది. వీటికి బదులు జార్జెట్‌, షిఫాన్‌, క్రేప్‌, లైట్‌ వెయిట్‌ చీరలు కట్టుకుంటే అవి చక్కగా అమరి శరీరం స్లిమ్‌గా, పొడవుగా ఉన్నట్లు కనిపిస్తుంది. బరువైన వాటికంటే తేలికపాటి చీరలు మంచి ఛాయి్‌సగా చెప్పవచ్చు.

  • పెద్ద పెద్ద పూలు, భారీ ప్రింట్లు ఉన్న చీరలు కట్టుకుంటే ఆ డిజైన్లు బాగా హైలైట్‌ అయి వాటి మధ్య పొట్టిగా ఉన్నట్లు కనిపిస్తారు. అలాకాకుండా చిన్న చిన్న బుటీలు, సన్నని డిజైన్లు, నాజూకైన ప్రింట్లు, పొడవాటి గీతల డిజైన్లు ఉన్న చీరలు కట్టుకుంటే సన్నగా పొడవుగా కనిపించవచ్చు.

  • బ్లౌజ్‌ కుట్టించుకునేటప్పుడు నెక్‌లైన్‌ డీప్‌గా ఉండేలా చూసుకోవాలి. వీ లేదా యూ నెక్‌ డిజైన్లు.. మెడ పొడవుగా కనిపించేలా చేస్తాయి. బ్లౌజ్‌ చేతులను కూడా పొడవుగా పెట్టించుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. బ్లౌజ్‌కు అనవసరమైన హంగులు జోడించకుండా వీలైనంత సింపుల్‌గా ఉంచుకుంటే చీరకట్టులో ఎత్తుగా అందంగా మెరిసిపోవచ్చు.

Also Read:

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..

కష్టపడి పని చేసేవారికి అవకాశాలు పుష్కలం: నారా భువనేశ్వరి

For More Latest News

Updated Date - Mar 26 , 2026 | 01:23 AM