Share News

అనుబంధం దృఢంగా...

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:00 AM

వర్క్‌ ఫ్రం హోం కొనసాగిస్తున్న చాలా మంది దంపతులు తరచూ ఎదుర్కొనే సమస్యే ఇది అయితే భార్యాభర్తల బంధం ఎంతో అందమైన, అద్భుతమైన అనుబంధం. కాబట్టి ఆ...

అనుబంధం దృఢంగా...

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! మేమిద్దరం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లం. గత రెండేళ్లుగా ఇంటి నుంచే పని చేస్తున్నాం. అయితే గత కొంత కాలంగా మా మధ్య చికాకులు, కోపతాపాలూ పెరుగుతున్నాయి. మా మధ్య సామరస్యమైన వాతావరణం నెలకొనే మార్గం లేదా?

ఓ సోదరి, హైదరాబాద్‌

వర్క్‌ ఫ్రం హోం కొనసాగిస్తున్న చాలా మంది దంపతులు తరచూ ఎదుర్కొనే సమస్యే ఇది అయితే భార్యాభర్తల బంధం ఎంతో అందమైన, అద్భుతమైన అనుబంధం. కాబట్టి ఆ అనుబంధానికి దంపతులిద్దరూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకునే మార్గాలను అన్వేషిస్తూ, అరమరికలు లేకుండా మెలగాలి.

భావ వ్యక్తీకరణ: చెబుతున్నది ఆలకించాలే తప్ప, ప్రతిస్పందించడం కోసం వినడం సరి కాదు. స్పందించడం కోసం చెబుతున్నది వినడం మొదలుపెడితే, పర్యవసానాలను భరించక తప్పదు

ప్రేమ, ఆప్యాయతలు: దంపతుల మధ్య బంధం ప్రేమ, ఆప్యాయతలతో ముడిపడి ఉండాలి. దాంపత్య బంధం మీద పట్టు సాధించాలంటే దంపతులు ఒకర్నొకరు అర్థం చేసుకోవాలి. సంసార జీవితం సజావుగా సాగించగలిగే మెలకువలను అలవరుచుకోవాలి

నాణ్యమైన సమయం: పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. ఎంత సమయం కలిసి గడిపాం అన్నది కాకుండా ఎంత నాణ్యమైన సమయాన్ని గడిపాం అన్నదే ముఖ్యంగా దంపతులు భావించాలి. అలాంటి సమయం కోసం తీరిక చేసుకోవాలి.

ప్రేమ భాష: ప్రేమను వ్యక్తం చేసుకునే కీలకమైన మార్గం.. స్పర్శ. హత్తుకోవడం, స్పృశించడం, చేతులు కలపడం... ఇవన్నీ దంపతులను మానసికంగా చేరువ చేసేవే! కాబట్టి ప్రతి రోజూ అంతటి సాన్నిహిత్యంతోనే మెలగాలి

దూర దృష్టి: జీవితం, అనుబంధం, కలిసి జీవితాన్ని కొనసాగించడంలో ఉండే ప్రయోజనాలను దూర దృష్టితో ఆలోచించాలి. దంపతులిద్దరూ పరస్పర వృత్తులనూ, సమయాలనూ, స్వేచ్ఛలనూ గౌరవించుకుంటూ అద్భుతమైన అనుబంధాన్ని ఏర్పరుచుకోవాలి. అనుకూల భావాలను స్వాగతిస్తూ, ప్రతికూల భావాలకు చోటు లేకుండా చూసుకోవాలి.

డాక్టర్‌ మధురిమ రెడ్డి పూత

సైకాలజిస్ట్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 03:00 AM