కారం రంగు మారుతోందా!
ABN , Publish Date - May 23 , 2026 | 05:59 AM
ఇంట్లో తయారుచేసుకునే కారం రంగు మారకుండా ఎక్కువ రోజులు ఘాటుగా తాజాగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి...
ఇంట్లో తయారుచేసుకునే కారం రంగు మారకుండా ఎక్కువ రోజులు ఘాటుగా తాజాగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి...
ప్రకాశవంతమైన ఎరుపు రంగులో బాగా ఎండిన మిరపకాయలను మాత్రమే తెచ్చుకోవాలి. పాత మిరపకాయలతో తయారుచేసిన కారం ఎర్రగా ఉండదు.
ఎండు మిరపకాయలను ఇంట్లోనే గ్రైండ్ చేసుకోవాలనుకున్నా లేదంటే మిల్లులో కారం కొట్టించాలనుకున్నా వాటికి ఏమాత్రం తేమ తగలకుండా చూసుకోవాలి. కొద్దిపాటి తేమ లేదా తడి తగిలినా ఆక్సిడేషన్ ప్రక్రియ వల్ల కారం రంగు తగ్గుతుంది. అందుకే కారం తయారుచేసేముందు మిరపకాయలను కనీసం గంటసేపు ఎండలో ఉంచడం మంచిది. దీనివల్ల కారం మెత్తగా ఘాటుగా తయారవుతుంది.
కారాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయకూడదు. గాలి చొరబడని స్టీల్ డబ్బాలు లేదా సీసాలను మాత్రమే ఉపయోగించాలి. గాలి తగలకుండా ఉంటే ఎంతకాలమైన కారం రంగు మారకుండా ఘాటుగా ఉంటుంది.
నిల్వ చేసిన డబ్బా లేదా సీసాలో ఎండిన బిర్యానీ ఆకును ఉంచితే కారం తేమను పీల్చుకోదు. అలాగే నాలుగైదు లవంగాలు లేదా రెండు మూడు ఇంగువ వుండలు ఉంచినా ఎక్కువకాలం కారం తాజాగా ఉంటుంది.
కారాన్ని తీసుకునేటప్పుడు పొడి చెంచాలను మాత్రమే వాడాలి.
నేరుగా సూర్యరశ్మి పడని చల్లని పొడి ప్రదేశంలో కారం డబ్బాను ఉంచాలి. దాన్ని స్టవ్, ఓవెన్ లాంటి వాటి పక్కన పెట్టకూడదు. వేడి ఎక్కువగా తగిలితే కారం రంగు మసకబారుతుంది. ఫ్రిజ్‌లో పెడితే ఆర్నెల్లకు పైగా కారం ఎర్రగా తాజాగా నిల్వ ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు.. ఏసీ ఆగ్రహం
Read Latest AP News And Telugu News