క్వినోవా తిందాం...
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:30 AM
క్వినోవా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
క్వినోవా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
దీనిలో పీచు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే కొద్ది పరిమాణంలో తిన్నప్పటికీ కడుపు నిండిన భావన కలుగుతుంది. చాలాసేపటి వరకు ఆకలి అనిపించదు. దీంతో క్రమంగా శరీర బరువు నియంత్రణలోకి వచ్చేస్తుంది.
క్వినోవాలోని పీచు.. జీర్ణాశయాన్ని, ప్రేగులను శుభ్రం చేస్తుంది. రోజూ తగినంత నీటిని తాగుతుంటే కడుపులో తేలికగా ఉన్న భావన కలుగుతుంది.
మొదట్లో క్వినోవాని ఎక్కువ పరిమాణంలో తినకూడదు. అలా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వేధిస్తాయి. కొద్ది కొద్దిగా తింటూ అలవాటు చేసుకుంటే ఏ సమస్య రాదు. రోజూ అన్నం వండేటప్పుడు బియ్యంలో కొద్దిగా క్వినోవాను కలిపితే ప్రయోజనకరంగా ఉంటుంది.
క్వినోవా తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలుస్తుంటుంది. దీంతో మధుమేహం అదుపులోకి వస్తుంది.
క్వినోవాలో మెగ్నీషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్ లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషణను అందిస్తాయి.
క్వినోవాలో గ్లూటెన్ ఉండదు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, ట్రై గ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News