Share News

టాపు లేపుతున్న టైమ్‌ కెఫె

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:25 AM

డెస్క్‌, వైఫైతో పాటు కాఫీలు, స్నాక్స్‌ అందించే వర్క్‌స్పేస్‌ సంస్కృతి కొవిడ్‌ తర్వాత ఊపందుకుంది. అయితే ఇలాంటి వాటికి పూర్తి భిన్నంగా, గడిపే సమయానికి...

టాపు లేపుతున్న టైమ్‌ కెఫె

వినూత్నం

డెస్క్‌, వైఫైతో పాటు కాఫీలు, స్నాక్స్‌ అందించే వర్క్‌స్పేస్‌ సంస్కృతి కొవిడ్‌ తర్వాత ఊపందుకుంది. అయితే ఇలాంటి వాటికి పూర్తి భిన్నంగా, గడిపే సమయానికి మాత్రమే డబ్బు చెల్లించే వీలున్న వినూత్నమైన వర్క్‌స్పే్‌సను స్థాపించింది పూణెకు చెందిన వందిత పురోహిత్‌. అన్ని రంగాల ఉద్యోగులనూ ఆకట్టుకుంటున్న మౌజి అనే ఆ టైమ్‌ కెఫె గురించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు...

ఫ్రీలాన్సర్లు, వ్యాపారవేత్తలు, నిపుణులు... వైఫై, డెస్క్‌తో పాటు, ఇతరులతో కనెక్ట్‌ కాగలిగి, స్ఫూర్తి పొందే వీలున్న వర్క్‌ప్లే్‌సల కోసం వెతకడం మొదలుపెడుతున్నారు. ఈ పోకడను కనిపెట్టిన వందిత అనే పూణెకు చెందిన వ్యాపారవేత్త, పూర్తి భిన్నమైన అనుభవాన్ని అందించే వర్క్‌

స్పే్‌సను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 22 ఏళ్ల వయసులో తన వ్యాపార ప్రయాణాన్ని మొదలుపెట్టిన వందిత, ఆ క్రమంలో వ్యాపార భాగస్వాములతో విభేదాలను ఎదుర్కొంది. ఆతిథ్య రంగం, కోవర్కింగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించడానికి ముందు అనేక సార్లు తన వ్యాపార ధోరణులను మార్చుకుంది. అలా చివరకు 2020 కొవిడ్‌ కాలంలో సంప్రదాయ కెఫెలకు భిన్నంగా మౌజి అనే టైమ్‌ కెఫెను నెలకొల్పింది. కార్యాలయాన్ని తలపిస్తూ, అదే సమయంలో అన్ని సౌకర్యాలనూ అందించే పనిప్రదేశంగా ఉపయోగపడుతున్న మౌజి నేడు, నిపుణులు, ఫ్రీలాన్సర్లు, క్రియేటర్లకు అవసరమైన సేవలను అందిస్తోంది.

విభిన్నమైన టైమ్‌ కెఫె...

‘‘కో వర్కింగ్‌ సెక్టార్‌లో పని చేశాను కాబట్టి స్నాక్స్‌, డ్రింక్స్‌ తప్పనిసరిగా ఆర్డర్‌ చేయాల్సిన అవసరం లేకుండా, సమయాన్ని గడిపే పని ప్రదేశాల అవసరాన్ని గ్రహించాను. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే మౌజి టైమ్‌ కెఫె. ఇక్కడకొచ్చేవాళ్లు ఇక్కడ గడిపే సమయానికి డబ్బు చెల్లించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలన్నిటినీ వినియోగించుకోవచ్చు’’ అంటూ తన కెఫె గురించి వివరిస్తోంది వందిత. మహరాష్ట్ర, నాగపూర్‌కు చెందిన వందిత పురోహిత్‌, 2008లో నాగపూర్‌ యూనివర్శిటీ నుంచి ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత 2009లో ఐటి సేల్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ అయిన మింట్‌ ట్రీని స్థాపించడం ద్వారా వ్యాపార ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 2015లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక బూట్‌క్యాం్‌పకు హాజరైన తర్వాత, ది దఫ్తర్‌ అనే కో వర్కింగ్‌ స్పేస్‌ను నెలకొల్పింది. తర్వాత 2018లో ప్రయాణాలతో పాటు పనులు కూడా చేసుకోగలిగే వీలున్న ట్రావర్క్‌ అనే ట్రావెల్‌ స్టార్ట్‌పను కూడా ప్రారంభించింది. మళ్లీ మూడేళ్లకు పాత ఫర్నిచర్‌ను పునరుద్ధరించే, కళాపెంట్రీ అనే డిజైనర్‌ స్టూడియోను నెలకొల్పింది. ఇలా డిజైన్‌, హాస్పిటాలిటీ, కమ్యూనిటీ బిల్డింగ్‌లో తనకున్న అనుభవం ఆధారంగా 2020లో మౌజీ అనే టైమ్‌ కెఫెను నెలకొల్పింది.


ఖాళీలను గుర్తించి, పూరించి...

కో వర్కింగ్‌ పరిశ్రమలో పని చేసిన కాలంలో వందిత, ప్రజలు సమయం గడపడం కోసం ఆఫీసులు, ఇళ్ల నుంచి బయటకు వెళ్తూ ఉండడం గమనించింది. కాఫీ తాగడానికీ, స్నాక్‌ తినడానికి కాకుండా పని చేయడానికీ, ఇతరులను కలవడానికీ, హాయిగా పుస్తకం చదువుకోడానికీ, లేదా కొంత సమయం సౌకర్యంగా గడపడానికీ కొందరు ఆఫీసులు, ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం ఆమె చూసింది. అయితే అప్పటివరకూ అందుబాటులో ఉన్న సంప్రదాయ కెఫెల్లో, ఒక టేబుల్‌ను ఆక్రమించుకుని కూర్చోవాలంటే, కూర్చున్నంత సేపు ఏదో ఒకటి ఆర్డర్‌ చేస్తూనే ఉండాలి. కానీ అలా ఆర్డర్‌ చేసే పని లేకుండా, నచ్చినంత సేపు సమయాన్ని గడిపే వీలున్న కెఫెను నెలకొల్పాలనే ఆలోచన అప్పుడామెకు స్ఫురించింది. అలాంటి కెఫెను డిజైన్‌ చేయడం కోసం కొనసాగించిన పరిశోధనలో, థర్డ్‌ ప్లేస్‌ అనే కాన్సెప్ట్‌ ఆమెకు ఎదురుపడింది. ఆఫీసు, ఇళ్ల బయట ప్రజలు ఒకరితో మరొకరు అనుసంధానమవడం, పని చేసుకోవడం లేదా కొంత సమయాన్ని గడిపే వీలున్న ప్రదేశమిది. ఇలాంటి వర్క్‌ప్లే్‌సలు పూణెలో లేవని కనిపెట్టిన వందిత, గడిపిన సమయానికి డబ్బు చెల్లించే వీలున్న మౌజి టైమ్‌కెఫెను నెలకొల్పింది. గంటకు 210 రూపాయలు వసూలు చేసే మౌజిలో అన్‌లిమిటెడ్‌ బెవరేజెస్‌ స్నాక్స్‌, వైఫై ఉంటాయి. ఈవెంట్‌ స్పేస్‌, స్టూడియో స్పేస్‌కు గంటకు 1500, మంత్లీ కోవర్కింగ్‌ స్పేస్‌కు నెలకు పది వేలు వసూలు చేస్తారు. నేడు ఏడాదికి రెండు కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న మౌజి, భవిష్యత్తులో మరింత పురోభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తోంది వందిత.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 05:25 AM