ఆయుష్షును పెంచే అవయవం
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:34 AM
గుండె, మెదడు, కాలేయం.. ఇవేవీ ఆయుష్షును పెంచలేవు. మెటబాలిజంను నియంత్రించడంతో పాటు ప్రొటీన్, చక్కెరలను శోషించుకుంటూ...
క్లోమం
గుండె, మెదడు, కాలేయం.. ఇవేవీ ఆయుష్షును పెంచలేవు. మెటబాలిజంను నియంత్రించడంతో పాటు ప్రొటీన్, చక్కెరలను శోషించుకుంటూ, ఇన్‌ఫ్లమేషన్‌నూ, శక్తి మోతాదులనూ క్రమబద్దీకరించే ‘క్లోమం’ మన ఆయుష్షును పెంచుతుంది.
క్లోమ గ్రంథి బలహీనపడితే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. కడుపుబ్బరం వేధిస్తుంది. బలహీనత బాధిస్తుంది. ఇవన్నీ ఆయుష్షును తగ్గించే అంశాలే! మరి క్లోమ గ్రంథిని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి? చక్కెర, మద్యాలకు దూరంగా ఉంటే సరిపోతుందా? కానే కాదు. క్లోమాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మన ఆహార వేళలు, నియమాలు మార్చుకోవాలి. పరగడుపున కాఫీ తాగడం, ఆకలితో పని లేకుండా, వేళాపాళా లేకుండా చిరుతిళ్లు తినడం, ఒత్తిడి... ఇవన్నీ క్లోమాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. వేళాపాళా లేకుండా, రొటీన్‌తో పని లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినే వాళ్లకు కూడా తీవ్రమైన పాంక్రియటైటిస్ తలెత్తడానికి కారణం ఇదే! క్లోమం ఆరోగ్యకరమైన ఆహారాన్నే కాదు, ఒక క్రమ పద్ధతినీ, స్థిరత్వాన్నీ ఇష్టపడుతుంది. ఉదయాన్నే వేడి వేడి అల్పాహారం తినాలి. భోజనానికీ భోజనానికీ మధ్య 3 నుంచి 4 గంటల విరామం ఉండేలా చూసుకోవాలి. ఆదుర్దాగా, గబగబా తినకుండా ప్రశాంతంగా తినాలి. అప్పుడే క్లోమానికి కోలుకునే సమయం చిక్కుతుంది. సామర్థ్యం సమకూరుతుంది. వేళగాని వేళ తినే ఒక చిన్న స్నాక్, అది ఆరోగ్యకరమైనదే అయినా క్లోమానికి మాత్రం ప్రమాదకరమైనదే! కడుపు మాడ్చుకోకపోయినా ఫరవాలేదు. కానీ 12 నుంచి 14 గంటల ఓవర్‌నైట్ ఉపవాసం మాత్రం పాటించాలి. పరగడుపునే నీళ్లు తాగాలి. వేడి వేడి అల్పాహారం తినాలి. తినే సమయంలో ఫోన్లు, టివిలకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్లతో క్లోమం భేషుగ్గా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్