Share News

గోళ్లు విరిగిపోతున్నాయా?

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:28 AM

ఒక్కోసారి గోళ్లు పెళుసుగామారి విరిగిపోతుంటాయి. అంతేకాదు అవి రంగుమారడం, వాటిపైన తెల్లటి మచ్చలు లేదా గీతలు ఏర్పడడం గమనిస్తుంటాం. అలాకాకుండా గోళ్లు...

గోళ్లు విరిగిపోతున్నాయా?

ఒక్కోసారి గోళ్లు పెళుసుగామారి విరిగిపోతుంటాయి. అంతేకాదు అవి రంగుమారడం, వాటిపైన తెల్లటి మచ్చలు లేదా గీతలు ఏర్పడడం గమనిస్తుంటాం. అలాకాకుండా గోళ్లు ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...

  • గోళ్లలో పేరుకుపోయిన మురికిని ఎప్పటికప్పుడు తొలగించాలి. రోజూ గోళ్లను సబ్బునీటితో శుభ్రం చేసుకుంటూ ఉంటే అవి అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి.

  • రెండువారాలకు ఒకసారి గోళ్లను కత్తిరించాలి. గ్లాస్‌ లేదా వుడెన్‌ ఫైల్‌ సహాయంతో గోళ్లను అందమైన షేప్‌లో అరగదీయవచ్చు. రెండు రోజులకోసారి జాగ్రత్తగా ట్రిమ్‌ చేస్తూ ఉంటే గోళ్లు విరగవు.

  • గోళ్లకు అంటుకుని ఉండే క్యూటికల్స్‌ పొరలను తొలగించకూడదు. ఇవి గోళ్లకు రక్షణ పొరలా వ్యవహరిస్తాయి. వాటిపైన కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ లేదా జోజోబా ఆయిల్‌ రాస్తూ ఉండాలి. అప్పుడే అవి ఎండినట్లు కాకుండా మృదువుగా ఉంటూ గోళ్లు విరగకుండా కాపాడతాయి.

  • తరచూ కోడిగుడ్లు, నట్స్‌, తాజా పండ్లు, పాలు, పెరుగు, పనీర్‌ తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఉండే బయోటిన్‌.. గోళ్లు బలంగా ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

  • చేతులు ఎక్కువసేపు నీళ్లలో నానకుండా చూసుకోవాలి. అలా నానితే గోళ్లు మెత్తబడి తేలికగా విరిగిపోతాయి. పాత్రలు కడిగేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు చేతులకు రబ్బరు తొడుగులు ధరించడం మంచిది. రసాయనాలు అధికంగా ఉండే డిటర్జెంట్లు, డిష్‌ వాషింగ్‌ లిక్విడ్లు వాడకూడదు.

  • కాలి గోళ్లు మందంగా గట్టిగా మారుతుంటాయి. అలాంటప్పుడు పాదాలను కొద్దిసేపు ఉప్పు నీటిలో ఉంచాలి. పావుగంట తరువాత కాలిగోళ్లు మెత్తబడతాయి. అప్పుడు వాటిని చక్కని షేప్‌లో కత్తిరించి కొద్దిగా మాయిశ్చరైజర్‌ రాస్తే అవి విరగకుండా మృదువుగా అందంగా కనిపిస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 12:28 AM