Share News

ఉదయాన్నే ఇలా...

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:00 AM

రోజంతా చురుకుగా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం లేవగానే ఏం చేయాలో చూద్దాం...

ఉదయాన్నే ఇలా...

రోజంతా చురుకుగా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం లేవగానే ఏం చేయాలో చూద్దాం...

  • ఉదయాన్నే ఒకగ్లాసు మంచినీటిని తాగితే శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

  • కొద్దిసేపు ఎండలో గడిపితే శరీరానికి కావాల్సిన డి విటమిన్‌ అందుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

  • నిద్రనుంచి మేల్కొనగానే ఫోన్‌ చూడవద్దు. అలా చూడడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి.

  • కొద్దిసేపు తేలికపాటి వ్యాయామాలు చేయాలి. శరీరంలో కదలికలను పెంచే స్ట్రెచ్చింగ్‌ వ్యాయామాలు చేస్తుంటే కండరాలకు ఉపశమనం లభిస్తుంది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది. వాకింగ్‌, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ లాంటివి చేయడం ప్రయోజనకరం.

  • యోగా లేదా ధ్యానం చేయడం కూడా మంచిదే. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ప్రాణాయామం, డీప్‌ బ్రీతింగ్‌ వ్యాయామాలు చేస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

  • ఉదయం పూట అల్పాహారాన్ని మానవద్దు. తాజా కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, మొలకలు, సలాడ్స్‌, పాలు, గుడ్లు, ఉడికించిన ఆహారపదార్థాలు తిసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి...

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 05:00 AM