Share News

వర్షాకాలంలో ఇల్లు తాజాగా...

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:52 AM

చల్లటి గాలులు, వర్షాల వల్ల ఇంట్లో తేమ పెరిగి ఓ విధమైన ముక్క వాసన రావడం గమనిస్తుంటాం. అలాంటప్పుడు ఇంటిని పొడిగా తాజాగా మార్చే చిట్కాల గురించి తెలుసుకుందాం...

వర్షాకాలంలో ఇల్లు తాజాగా...

చల్లటి గాలులు, వర్షాల వల్ల ఇంట్లో తేమ పెరిగి ఓ విధమైన ముక్క వాసన రావడం గమనిస్తుంటాం. అలాంటప్పుడు ఇంటిని పొడిగా తాజాగా మార్చే చిట్కాల గురించి తెలుసుకుందాం...

  • పడకగదిలో పరుపులు, దిండ్లు, దుప్పట్లు గాలిలోని తేమను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల వాటినుంచి ఘాటైన వాసనలు వస్తుంటాయి. అప్పుడు వీటిని ఎండలో కాసేపు ఉంచితే సరిపోతుంది. వాటిపై కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లి గంట తరువాత వ్యాక్యూమ్‌ క్లీనర్‌ లేదా బ్రష్‌తో శుభ్రం చేస్తే వాసనలు పోతాయి.

  • తడిసిన చెప్పులు, షూలను ఉంచడం వల్ల ర్యాక్‌ నుంచి దుర్వాసన వస్తుంటుంది. చిన్న గిన్నెలో నాలుగైదు లవంగాలు, ఏడెనిమిది కర్పూరం బిళ్లలు వేసి దాన్ని షూ ర్యాక్‌లో పెడితే సమస్య తీరుతుంది.

  • సోఫా కుషన్ల నుంచి చెడు వాసనలు వస్తుంటే... పలుచని రుమాలులో రెండు చెంచాల కల్లుప్పు, రెండు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌(లావెండర్‌, లెమన్‌, మింట్‌... తదితరాల్లో ఒకటి) వేసి మూటలా కట్టి సోఫాలో ఓ మూలగా ఉంచాలి.

  • సాధ్యమైనంతవరకు ఇంట్లో తడి బట్టలు ఆరేయకూడదు. వీటివల్ల ఇంట్లో తేమ పెరుగుతుంది.

  • బయట వర్షం తగ్గినవెంటనే కిటికీలు, తలుపులు తెరచి ఉంచాలి. అప్పుడే తాజా గాలి లోపలికి ప్రసరించి దుర్వాసనలను తొలగిస్తుంది.

  • రోజూ కొద్దిసేపు ఇంట్లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ లేదా డీ హ్యుమిడిఫయర్‌ను వినియోగించడం మంచిది. హాల్లో రూమ్‌ ఫ్రెషనర్‌ను స్ర్పే చేస్తే ఇల్లంతా తాజాగా మారుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక సమస్యలపై దృ‌ష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన

అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 12:52 AM