Share News

పనికిరానివి వదిలించుకుందాం

ABN , Publish Date - Nov 12 , 2026 | 02:31 AM

అనవసరమైన వస్తువులను ఇంటి నుంచి తొలగించడం ద్వారా మనసులోని ఆలోచనలను, ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతతను పొందే ఒక అద్భుత జీవన విధానం ఇది....

పనికిరానివి వదిలించుకుందాం

అనవసరమైన వస్తువులను ఇంటి నుంచి తొలగించడం ద్వారా మనసులోని ఆలోచనలను, ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతతను పొందే ఒక అద్భుత జీవన విధానం ఇది.

ఇల్లు అంటే వస్తువులను సర్దే చోటు మాత్రమే కాదు.. అది మన మనసుకు అద్దం పట్టే ప్రదేశం. కానీ, కాలక్రమేణా మనకు తెలియకుండానే ఇంట్లో ఎన్నో వస్తువులు పోగుపడుతుంటాయి. ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దాచుకున్న పాత సామగ్రి, విరిగిపోయిన వస్తువులు, మళ్లీ ఎప్పటికీ వేసుకోని దుస్తులు ఇవన్నీ ఇళ్లలో స్థలాన్ని ఆక్రమించడమే కాక, మనసుపైనా విపరీతమైన భారాన్ని మోపుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ట్రెండ్‌ అవుతున్న సరికొత్త కాన్సెప్ట్‌ ‘మైండ్‌ఫుల్‌ డిక్లట్టరింగ్‌’

మనసూ గందరగోళమే

ఇంట్లో వస్తువులు పేరుకుపోవడం వల్ల కలిగే నష్టం కేవలం స్థలం కోల్పోవడం మాత్రమే కాదు, అది మెదడును గందరగోళానికి గురిచేస్తుంది. కంటికి కనిపించే అస్తవ్యస్తత మనలో తెలియని ఆందోళనను, ఒత్తిడిని పెంచుతుంది. ముఖ్యంగా రోజూ ఉదయం ఏ డ్రెస్‌ వేసుకోవాలి? ఏ వస్తువు ఎక్కడ ఉందో వెతుక్కోవడానికి సమయం వృథా కావడం వల్ల మానసిక శక్తి క్షీణిస్తుంది. ఇల్లు ఎంత శుభ్రంగా, ఖాళీగా ఉంటే మన ఆలోచనలు అంత స్పష్టంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

వస్తువులతో బంధం

సాధారణంగా ఇల్లు సర్దడం అంటే.. ఏదో ఒక రోజు అన్నీ బయటపడేసి శుభ్రం చేయడం అనుకుంటాం. కానీ ‘మైండ్‌ఫుల్‌ డిక్లట్టరింగ్‌’ అనేది దానికంటే భిన్నమైది. ఇది వస్తువులతో మనకున్న భావోద్వేగ బంధాన్ని బేరీజు వేసుకుంటూ.. నిజంగా మన జీవితానికి అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకునే ఒక మానసిక ప్రక్రియ. ఒక వస్తువును పారవేసేటప్పుడు లేదా దానం చేసేటప్పుడు ‘ఇది ఇప్పుడు నా జీవితానికి ఉపయోగపడుతుందా?’ అని ప్రశ్నించుకోవడమే దీని ప్రధాన సూత్రం.


చిన్న అడుగుతో పెద్ద మార్పు

ఈ డ్లికట్టరింగ్‌ ప్రక్రియను ఎక్కడి నుంచే పెద్ద ఎత్తున ప్రారంభించాల్సిన అవసరం లేదు. రోజూ ఒక చిన్న డ్రాయర్‌ లేదా ఒక వార్డ్‌రోబ్‌ రాక్‌తో దీనిని మొదలుపెట్టవచ్చు. మనం ఏడాది కాలంగా ముట్టుకోని వస్తువులను, దుస్తులను వేరేవారికి దానం చేయడం వల్ల ఇల్లు విశాలంగా మారడమే కాకుండా, మనసు తేలికైన భావన కలుగుతుంది.

ఉపశమనం

ఈ కాన్సెప్ట్‌ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటి నిర్వహణ భారాన్ని తగ్గించుకోవడానికి, కుటుంబ సభ్యులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. అనవసరమైన వస్తువుల బరువును దించుకుని, మనసుకు ఇష్టమైన, అవసరమైన వాటితో జీవించే ఈ సరికొత్త ట్రెండ్‌ను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 02:31 AM