Share News

మెనోపాజ్‌ డైట్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 02:47 AM

గర్భిణిగా ఉన్న సమయంలో తినే ఆహారం మీద ఎంతటి శ్రద్ధ కనబరుస్తామో మెనోపాజ్‌లో కూడా అంతే శ్రద్ధ కనబరచాలి. మెనోపాజ్‌లో హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల నడి వయసు మహిళలు...

మెనోపాజ్‌ డైట్‌

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! నా వయసు 55. మెనోపాజ్‌తో బాధపడుతున్నాను. నీరసం, నిస్సత్తువలు వేధిస్తున్నాయి. ఈ సమయంలో నేనెలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?

ఓ సోదరి, హైదరాబాద్‌

గర్భిణిగా ఉన్న సమయంలో తినే ఆహారం మీద ఎంతటి శ్రద్ధ కనబరుస్తామో మెనోపాజ్‌లో కూడా అంతే శ్రద్ధ కనబరచాలి. మెనోపాజ్‌లో హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల నడి వయసు మహిళలు మధుమేహం, ఆర్థరైటిస్‌, గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. అయితే ఈ సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకోవాలి. అలాగే బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆర్థరైటిస్‌ సమస్య ముదరకుండా ఉండడం కోసం ఆహారంలో క్యాల్షియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. హార్మోన్‌ అవకతవకల వల్ల ఈ వయసులో అజీర్తి, కడుపుబ్బరం, అసిడిటీ కూడా వేధిస్తూ ఉంటాయి. వాటికి తగ్గట్టు ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

  • ఉదయం సాధ్యమైనంత పెందలాడే బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తూ ఉండాలి

  • పాలు, గుడ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి

  • పీచుతో కూడిన ప్రొటీన్‌ పదార్థాలైన రాజ్మా, సెనగలు, బొబ్బర్లు తరచూ తింటూ ఉండాలి

  • మాంసాహారం తినేవాళ్లు ఇంట్లో వండిన చికెన్‌, ఫిష్‌ తినాలి

  • రోజూ తప్పనిసరిగా ఏదో ఒక పండు తినడం అలవాటు చేసుకోవాలి

  • లంచ్‌లో ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి

  • సాయంత్రం సమయాల్లో టీ, కాఫీలు తగ్గించి డ్రై ఫ్రూట్స్‌ తినాలి

  • కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం మొదలైన ద్రవాహారం తీసుకోవాలి

  • ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం పెందలాడే తినాలి. లంచ్‌ కూడా సమయానికి చేస్తూ ఉండాలి.

  • క్యాల్షియం, బి12 దొరికే చికెన్‌, గుడ్లు, బొబ్బర్లు, అలసందలు, బీన్స్‌ తరచూ తింటూ ఉండాలి

  • అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌ తింటూ ఉండాలి

  • ఒమేగా3 ఉన్న బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, నువ్వులు, గుమ్మడి, పుచ్చ విత్తనాలు, రైస్‌ బ్రాన్‌, ఆలివ్‌ ఆయిల్స్‌ వాడకం పెంచాలి.

  • ఒమేగా 6 ఉండే సన్‌ఫ్లవర్‌, కాటన్‌ సీడ్‌, పామాయిల్‌ వాడకం తగ్గించాలి.

  • చర్మం సాగిపోకుండా, బిగుతుగా ఉండడం కోసం సరిపడా నీళ్లు తాగాలి.

  • ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి రోజుకు ఒక టీస్పూను వరకూ తీసుకుంటే చర్మం యవ్వనంగా ఉంటుంది.

  • నడి వయసు రక్తపోటును పెంచే వయసు కాబట్టి. ఉప్పు వాడకం తగ్గించాలి. పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు బాగా తగ్గించేయాలి.

  • తీపి పదార్థాలు తగ్గించి బరువు పెరగకుండా చూసుకోవాలి.

డాక్టర్‌ సుజాత స్టీఫెన్‌

చీఫ్‌ న్యూట్రిషనిస్ట్‌, హైదరాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 02:47 AM