Share News

మస్కారాతో మతి పోగొట్టేలా..

ABN , Publish Date - May 16 , 2026 | 01:26 AM

కళ్ల అందాన్ని రెట్టింపు చేసే సౌందర్యసాధనం... మస్కారా! కానీ దీన్ని ఉపయోగించే సరైన విధానం గురించి అందరికీ తెలియకపోవచ్చు. మస్కారాతో మతిపోగొట్టడానికి...

మస్కారాతో మతి పోగొట్టేలా..

మేకప్‌

కళ్ల అందాన్ని రెట్టింపు చేసే సౌందర్యసాధనం... మస్కారా! కానీ దీన్ని ఉపయోగించే సరైన విధానం గురించి అందరికీ తెలియకపోవచ్చు. మస్కారాతో మతిపోగొట్టడానికి అనుసరించాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే....

కనుబొమ్మలు ఒత్తుగా కనిపించడం కోసం, మస్కారా వాండ్‌ను కనురెప్పల చివర్ల నుంచీ అప్లై చేయడం మొదలుపెట్టి, చివరి వరకూ తీసుకురావాలి. కనురెప్పల వెంట్రుకల మధ్య తగినంత జాగా ఏర్పడి, చక్కని ఆకృతి సంతరించుకోవడం కోసం రెండు కోట్స్‌ వేసుకోవాలి. కనురెప్పల వెంట్రుకలు అతుక్కుపోకుండా, ముద్దగా మారిపోకుండా ఉండడం కోసం, అప్లికేషన్‌కు ముందు వాండ్‌కు అంటుకున్న అదనపు మస్కారాను తొలగించాలి. అలాగే..

  • వాండ్‌ మొన సహాయంతో ఒక్కో ల్యాష్‌కూ మస్కారా అప్లై చేయాలి. ప్రత్యేకించి కింది కనురెప్ప వెంట్రుకలు, లోపలి మూలల మీద దృష్టి పెట్టాలి

  • మొదటి కోట్‌ పూర్తిగా ఆరిపోయిన తర్వాతే రెండో కోట్‌ వేసుకోవాలి

  • వాండ్‌ను టిష్యూకు అద్ది అదనపు మస్కారాను తొలగించి, ఆ తర్వాతే అప్లై చేసుకోవాలి.

  • కనురెప్పలు రెట్టింపు ఒత్తుగా కనిపించడం కోసం, కనురెప్పల అడుగు నుంచి పైనుంచి మస్కారా అప్లై చేసుకోవాలి

  • మస్కారా వేసుకోడానికంటే ముందు కనురెప్పలను కర్ల్‌ చేసుకోవాలి

  • ఒత్తుగా కనిపించడం కోసం, కనురెప్పలకు ల్యాష్‌ ప్రైమర్‌ను అప్లై చేయాలి

  • మస్కారా అప్లై చేసిన తర్వాత, కనురెప్పలు అంటుకుపోకుండా, వెంట్రుకలు విడివిడిగా కనిపించడం కోసం, స్పూలీని ఉపయోగించి దువ్వాలి

  • మస్కారా ఎండిపోయినట్టు కనిపిస్తే, ఆ బాటిల్‌ను వేడి నీళ్లలో ఉంచాలి

  • కళ్ల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా ఉండాలంటే, మస్కారాను ప్రతి మూడు నెలలకూ మారుస్తూ ఉండాలి.

ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 16 , 2026 | 01:26 AM