Share News

కార్పెట్‌తో కళగా...

ABN , Publish Date - Nov 12 , 2026 | 02:35 AM

ఇంట్లో హాల్‌, లివింగ్‌ రూమ్‌లను గ్రాండ్‌గా మార్చడంలో కార్పెట్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంటీరియర్స్‌కు తగ్గట్టు విభిన్నమైన కార్పెట్లను ఎలా ఎంపిక చేసుకోవాలో చూద్దాం...

కార్పెట్‌తో కళగా...

ఇంట్లో హాల్‌, లివింగ్‌ రూమ్‌లను గ్రాండ్‌గా మార్చడంలో కార్పెట్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంటీరియర్స్‌కు తగ్గట్టు విభిన్నమైన కార్పెట్లను ఎలా ఎంపిక చేసుకోవాలో చూద్దాం...

పాస్టెల్‌ ఫ్లవర్‌ కార్పెట్‌

హాల్లో గోడలకు క్రీమ్‌, బేజ్‌ లాంటి పాస్టెల్‌ కలర్స్‌ వేసి ఉంటే వాటికి మ్యాచ్‌ అయ్యేలా రంగు రంగుల పూల కార్పెట్‌ను సోఫా ముందు వేస్తే బాగుంటుంది. లేత గులాబీ, సేజ్‌ గ్రీన్‌, లావెండర్‌, లేత నీలం పువ్వులతో నిండిన కార్పెట్లు హాల్‌ని విశాలంగా, ప్రకాశవంతంగా మార్చేస్తాయి. దీనితోపాటు సోఫా కుషన్లకు కూడా మ్యాచింగ్‌ కవర్లను వేస్తే హాల్‌కి క్లాసీ లుక్‌ వచ్చేస్తుంది.

వింటేజ్‌ కార్పెట్‌

ఇది లివింగ్‌ రూమ్‌లో వేయడానికి బాగుంటుంది. మధ్యలో పెద్ద గులాబీ పూల గుత్తి చుట్టూరా పూలు, ఆకులు, కొమ్మల డిజైన్లతో ప్రశాంతమైన అనుభూతినిస్తుంది. చెక్క ఫర్నిచర్‌, గుండ్రని టీపాయ్‌లకు ఇది అందంగా నప్పుతుంది.

బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ కార్పెట్‌

ఇంటీరియర్స్‌ అంతగా లేని సాధారణ హాల్లో ఈ కార్పెట్‌ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ లాంటి ముదురు రంగుల్లో పెద్ద పెద్ద డిజైన్లతో విలక్షణంగా ఉంటుందీ స్టేట్‌మెంట్‌ కార్పెట్‌. కిటికీలకు సాదా కర్టెన్లు, సోఫా కుషన్లకు మామూలు కవర్లను ఎంపిక చేసుకుంటే అందం ప్రకాశిస్తుంది.

కశ్మీరీ కార్పెట్‌

సంప్రదాయ డిజైన్లు ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక. చిన్న చిన్న పూలు, ఆకులు, కొమ్మలతో నిండిన ఈ కశ్మీరీ కార్పెట్‌ ఎలాంటి ఇంట్లోనైనా అందంగా సూటవుతుంది. గులాబీ, ఆకుపచ్చ, క్రీమ్‌, ఎరుపు రంగుల కలయికతో విభిన్నమైన డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.

టాసెల్స్‌ కార్పెట్‌

ఇది అంచుల వెంబడి దారాల కుచ్చులతో బోహేమియన్‌ డిజైన్లతో నిండి ఉంటుంది. మోడరన్‌ ఇంటీరియర్స్‌ మధ్య ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెదురు ఫర్నిచర్‌, చెక్క బల్లల ముందు వేసినా కూడా బాగుంటుంది. హాల్లో మధ్యగా గుండ్రని కార్పెట్‌ వేసి దానిపైన టీపాయ్‌ పెడితే ఇంటికి రాయల్‌ లుక్‌ వస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 02:35 AM