జ్వరం మాత్ర అవసరమా?
ABN , Publish Date - Jul 28 , 2026 | 04:53 AM
వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే క్రమంలో మన శరీరం జ్వరంతో వేడెక్కే సహజసిద్ధ మార్గాన్ని ఎంచుకుంటుంది. అలాంటప్పుడు జ్వరం మాత్రతో ఒంటిని చల్లబరుచుకోవడం..
తెలుసుకుందాం
వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే క్రమంలో మన శరీరం జ్వరంతో వేడెక్కే సహజసిద్ధ మార్గాన్ని ఎంచుకుంటుంది. అలాంటప్పుడు జ్వరం మాత్రతో ఒంటిని చల్లబరుచుకోవడం అవసరమా? ఇలాంటప్పుడు వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉండదా?
మన శరీరం మీద వైరస్ దాడి చేసినప్పుడు, వ్యాధినిరోధక వ్యవస్థ శరీర ఉష్ణోగ్రతను పెంచేలా హైపోథలామ్‌సను ప్రేరేపిస్తుంది. శరీరం వేడెక్కడంతో వైరస్ వృద్ధి నెమ్మదించి, తెల్లరక్తకణాలు ఉధృతంగా పోరాడడం మొదలుపెడతాయి. మరి అలాంటప్పుడు పారాసెటమాల్ లాంటి జ్వరం మాత్ర వేసుకుని, ఆ ప్రక్రియకు ఆటంకం కలిగించడం ఎంతవరకూ సమంజసం? అని మనకు అనుమానం రావచ్చు. అయితే పారాసెటమాల్ వైర్‌సను ఏ విధంగానూ చంపలేదు. అయితే అలా చంపకపోయినా, జ్వరంతో పెరిగే శారీరక అసౌకర్యాన్నీ, భౌతిక ఒత్తిడినీ తగ్గిస్తుంది. అత్యధిక శరీర ఉష్ణోగ్రత గుండె వేగాన్నీ, ఆక్సిజన్ అవసరాన్నీ పెంచి, శరీరంలోని ద్రవ పరిమాణాన్ని తగ్గిస్తుంది. దాంతో కొందరు అలసటకు లోనవుతారు. ఈ పరిస్థితి కొందరికి హానికరం కూడా! అయితే పారాసెటమాల్, శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, క్రౌడ్ కంట్రోల్‌కు సహాయపడుతుంది. ఫలితంగా శరీరం వేడెక్కిపోకుండానే, ఇన్‌ఫెక్షన్‌తో తలపడగలుగుతుంది. ఈ మాత్రతో శరీరం సౌకర్యవంతంగా మారిపోతుంది కాబట్టి సరిపడా విశ్రాంతి కూడా తీసుకోగలుగుతాం. ద్రవాహారం తీసుకోగలుగుతాం, ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకోగలుగుతాం!
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News