పిండిని నిల్వ చేస్తున్నారా!
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:06 AM
మనం ఇడ్లీ లేదా దోశల కోసం బియ్యం, మినపగుండ్లను తగిన పాళ్లలో తీసుకుని నీళ్లలో ఒక పూటంతా నానబెట్టి ఆపైన పిండిలా రుబ్బి ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటాం...
మనం ఇడ్లీ లేదా దోశల కోసం బియ్యం, మినపగుండ్లను తగిన పాళ్లలో తీసుకుని నీళ్లలో ఒక పూటంతా నానబెట్టి ఆపైన పిండిలా రుబ్బి ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటాం. ఈ పిండిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచి వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రిజ్‌లో పెట్టినా కూడా పిండి పులిసే ప్రక్రియ ఆగదు. కొద్దిగా నెమ్మదిస్తుంది. మూడు రోజుల తరువాత పిండిలో ఉండే కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై ఆల్కహాల్, ఈస్ట్ లాంటివి ఏర్పడతాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి పిండిని రుబ్బిన నాటి నుంచి మూడు రోజుల తరువాత వాడకూడదు.
పిండి పులుస్తున్న కొద్దీ దానిలో ఆమ్లత్వం పెరుగుతుంది. అలాంటి పిండితో ఇడ్లీ, దోశ తదితరాలను తయారుచేసుకుని తింటే కడుపులో మంటగా అనిపించవచ్చు.
పిండిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే అందులో సాల్మోనెల్లా బ్యాక్టీరియా వృద్ధి పొందుతుంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి లాంటి లక్షణాలు కనిపించవచ్చు.
పిండి రంగు మారినా, పుల్లటి వాసన వస్తున్నా దాన్ని వాడకూడదు.
రుబ్చిన పిండిని ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంచకూడదు. స్టీల్ గిన్నెలు లేదా గాజు పాత్రలను మాత్రమే ఉపయోగించాలి.
మొత్తం పిండిలో ఒకేసారి ఉప్పు కలపకూడదు. దీనివల్ల పిండి త్వరగా పులుస్తుంది. అవసరమైనంత వరకు మాత్రమే వేరే గిన్నెలోకి తీసుకుని దానిలో తగినంత ఉప్పు కలుపుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News