ఇక సులువుగా గుండె స్కానింగ్
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:20 AM
గుండెను స్కానింగ్ చేసే అత్యాధునిక సిటి స్కానింగ్ మిషన్ ‘640 స్లైస్ సిటి స్కానర్’ అందుబాటులోకి వచ్చింది. ఇటువంటివి దేశంలో మూడే మూడు ఉండగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి....
కొత్తగా
గుండెను స్కానింగ్ చేసే అత్యాధునిక సిటి స్కానింగ్ మిషన్ ‘640 స్లైస్ సిటి స్కానర్’ అందుబాటులోకి వచ్చింది. ఇటువంటివి దేశంలో మూడే మూడు ఉండగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి మన హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. మెడికవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్‌రెడ్డి దాని పనితీరును వివరించారు.
శరీరంలో 16 సెంటీమీటర్ల పరిధిని ఇమేజ్ చేసే పరికరమిది. మునుపటి సిటి యంత్రాలన్నీ కదులుతూ, తిరుగుతూ పనిచేసేవి. పైగా ఇమేజింగ్‌కు ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ ఉండేవి. గుండె నిరంతరం కదిలే అవయవం కాబట్టి దీని ఇమేజ్‌ను స్వీకరించడం కొంత క్లిష్టంగా ఉంటుంది. 640 స్లైస్ సిటి స్కానర్ 16 సెంటీమీటర్ల స్టక్చర్‌ను సేకరించగలుగుతోంది కాబట్టి అతి తక్కువ సమయంలో కచ్చితమైన ఇమేజింగ్ మొత్తం పూర్తయిపోతుంది. మునుపటి సిటిలతో పోల్చుకుంటే తాజా సిటి స్కానర్ ఎన్నో విధాల మెరుగైనది. ఎలాగంటే...
పాత సిటి స్కానర్ల ఇమేజింగ్ కోసం కనీసం 8 సెకన్ల పాటు శ్వాసను ఆపవలసి వస్తుంది, కానీ తాజా స్కానర్‌తో ఆ సమస్య ఉండదు
హృదయ స్పందనను 70కి తగ్గించినప్పుడే పాత సిటిలు ఇమేజింగ్ చేయగలుగుతాయి. తాజా స్కానర్‌కు హృదయ స్పందన అవరోధం కాదు
పాత సిటి స్కానర్ల ఇమేజింగ్‌కు కనీసం అరగంట సమయం పడుతుంది. తాజా సిటి ఇమేజింగ్ మొత్తం సెకనులో నాలుగో వంతులోనే పూర్తయిపోతుంది
త్వరితం, సమర్థం
ఇమేజింగ్ పూర్తయిన తర్వాత, రేడియాలజిస్ట్, ఒక టెక్నీషియన్ ప్రతి ఇమేజ్‌ను పరిశీలించి, రక్తనాళాన్ని మార్క్ చేయవలసి వస్తుంది. కానీ 640 స్లైస్ సిటి స్కానర్, ఎఐ ఇంటిగ్రేటెడ్ కాబట్టి, మార్కింగ్ అవసరం ఉండదు. ఇమేజింగ్ పూర్తయిన వెంటనే అంతిమ ఇమేజ్ చేతికి అందుతుంది. పైగా ఫలితం ఎంతో కచ్చితంగా ఉంటుంది. త్వరిత ఇమేజింగ్, త్వరిత ఫలితం 640 స్లైస్ సిటి స్కానర్‌తో సాధ్యపడుతుంది. మునుపు కొరొనరీ యాంజియోగ్రామ్‌కూ సిటి కొరొనరీ యాంజియోగ్రామ్‌కూ మధ్య రిజల్యూషన్ పరంగా కొంత వ్యత్యాసం ఉండేది. ఈ రెండు సిటిల కోసం శ్వాస నిలిపి ఉంచడం, హృదయస్పందన తక్కువగా ఉండడం లాంటి పరిమితులను పాటించవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే సిటి యాంటియొగ్రామ్ సాధ్యపడుతుంది. లేనప్పుడు సంప్రదాయ పద్ధతిలో కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయవలసి వస్తుంది. కానీ ఈ యంత్రానికి అలాంటి పరిమితులు ఉండవు.
రక్తనాళాల్లో అవరోధాలను కనిపెట్డడంతో పాటు ఇమేజింగ్ సమయంలోనే చికిత్సను ప్లాన్ చేసుకోగలిగే సౌలభ్యం 640 స్లైస్ సిటి స్కానర్‌లో ఉంటుంది. పరిస్థితి తీవ్రతను బట్టి అవరోధాలను తొలగించి గుండెకు రక్షణ కల్పించే చికిత్సలను వైద్యులు అంతిమంగా ఎంచుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..
చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And Telugu News