ఎక్కిళ్లు తగ్గేదెలా..?
ABN , Publish Date - Jun 10 , 2026 | 02:36 AM
అకస్మాత్తుగా వచ్చే ఎక్కిళ్లను వెంటనే తగ్గించే చిట్కాలివే...
అకస్మాత్తుగా వచ్చే ఎక్కిళ్లను వెంటనే తగ్గించే చిట్కాలివే...
నాలుకపై కొద్దిగా చక్కెర వేసుకుని మూడు సెకన్లు అలాగే ఉండాలి. ఆపైన నెమ్మదిగా మింగాలి. దీంతో గొంతులోని నరాలు ఉత్తేజితమై ఎక్కిళ్లను తగ్గిస్తాయి.
గ్లాసులో చల్లటి నీళ్లను తీసుకుని స్ట్రా సహాయంతో నెమ్మదిగా సిప్ చేయాలి. లేదంటే నోట్లో పోసుకుని పుక్కిలించాలి. వెంటనే ఎక్కిళ్లనుంచి ఉపశమనం కలుగుతుంది.
ఒక పేపర్ బ్యాగ్‌ను ముక్కుకు దగ్గరగా పెట్టుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలాలి. ఇలా నాలుగైదుసార్లు చేస్తే బ్యాగ్‌లో కార్బన్‌డయాక్సైడ్ చేరుతుంది. దీని ప్రభావంవల్ల ఊపిరితిత్తుల్లోని డయాఫ్రమ్ అనే కండరం కొద్దిగా సడలి ఎక్కిళ్లు మాయమవుతాయి.
చిన్న నిమ్మకాయ ముక్కను నోట్లో వేసుకుని చప్పరించినా వెంటనే ఫలితం కనిపిస్తుంది.
నాలుక చివరను రెండు వేళ్లతో గట్టిగా పట్టుకుని బయటికి లాగితే గొంతులోని కండరాలు ఉద్దీపన చెంది ఎక్కిళ్లు తగ్గుతాయి.
ఎక్కిళ్లు వస్తున్నప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని వీలైనంతసేపు బిగపట్టి ఉంచి ఆపైన నెమ్మదిగా వదలితే ప్రయోజనం ఉంటుంది.
ముక్కును రెండు వేళ్లతో మూసి నోటిని కూడా మూసుకుని బుగ్గల నిండా గాలిని పూరిస్తే ఎక్కిళ్లు మాయమవుతాయి.
నేలపై కూర్చుని రెండు మోకాళ్లను ఛాతి వద్దకు తీసుకువచ్చి కొద్దిగా ముందుకు వంగితే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News