నల్లని వలయాలు ఇలా మాయం
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:05 AM
నిద్రలేమి, అలసట, డీహైడ్రేషన్, అలర్జీ, ఐరన్ లోపం తదితర కారణాల వల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. వీటిని చిన్న చిట్కాలతో పోగొట్టుకోవచ్చు. ఎలాగంటే...
నిద్రలేమి, అలసట, డీహైడ్రేషన్, అలర్జీ, ఐరన్ లోపం తదితర కారణాల వల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. వీటిని చిన్న చిట్కాలతో పోగొట్టుకోవచ్చు. ఎలాగంటే...
చిన్న గిన్నెలో రెండు చెంచాల కలబంద గుజ్జు, రెండు చెంచాల కీర రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకింద ప్యాక్‌లా వేయాలి. కళ్లమీద రెండు కీర చక్రాలు ఉంచుకుని అరగంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. కలబంద, కీరాల్లో ఉండే కూలింగ్ ఏజెంట్స్ చర్మాన్ని తేమతో నింపుతాయి. కళ్ల కింద రక్తప్రసరణను పెంచుతాయి. దీంతో కళ్ల చుట్టూ ఏర్పడిన నల్లని వలయాలు మాయమవుతాయి.
ఒక గిన్నెలో అర చెంచా కాఫీ పొడి, చెంచా తేనె వేసి కలపాలి. దీన్ని కొద్ది కొద్దిగా వేలితో తీసుకుంటూ కళ్లచుట్టూ మెల్లగా మర్దన చేయాలి. పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే క్రమంగా కళ్ల కింద నలుపు, ఉబ్బు తగ్గుతాయి.
రెండు చెంచాల బంగాళదుంప రసంలో చెంచా తేనె లేదా పుదీనా ఆకుల రసం కలిపిన మిశ్రమాన్ని కళ్ల కింద రాసి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే బంగాళదుంపలోని బ్లీచింగ్ గుణాలు.. కళ్ల కింద నలుపు విరిగేలా చేస్తాయి.
చెంచా చల్లటి పెరుగులో రెండు చెంచాల గ్రీన్ టీని కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ పట్టించి అరగంటసేపు విశ్రాంతి తీసుకొని ఆపైన గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు ప్రభావవంతంగా పనిచేసి మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి.
చిన్న సీసాలో రెండు చెంచాల బాదం నూనె, రెండు చెంచాల ఇ విటమిన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. రోజుకు మూడుసార్లు ఈ మిశ్రమాన్ని వేలితో తీసుకుని కళ్ల చుట్టూ మర్దన చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News