మెడపై ముడతలు తగ్గేదెలా
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:10 AM
చర్మం పొరల్లో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం, నూనె గ్రంథులు సరిగా పనిచేయకపోవడం లాంటి కారణాల వల్ల మెడపై ముడతలు, గీతలు ఏర్పడుతుంటాయి. వీటిని సులువుగా...
చర్మం పొరల్లో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం, నూనె గ్రంథులు సరిగా పనిచేయకపోవడం లాంటి కారణాల వల్ల మెడపై ముడతలు, గీతలు ఏర్పడుతుంటాయి. వీటిని సులువుగా తగ్గించే చిట్కాలివే...
సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాల వల్ల మెడ చర్మంలో ఉండే ఎలాస్టిన్ ఫైబర్లు నశించిపోవచ్చు. దీంతో స్థితిస్థాపకతను కోల్పోయి చర్మం ముడతలు పడుతుంది. కాబట్టి బయటికి వెళ్లేముందు మెడకు సన్‌స్ర్కీన్ రాసుకోవడం మంచిది.
చూయింగ్ గమ్ నమలడం వల్ల మెడకు మంచి వ్యాయామం చేసినట్లవుతుంది. మెడను నిటారుగా ఉంచి నోరు తెరవకుండా షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌ను నములుతుంటే మెడ పైన ఏర్పడిన ముడతలు మాయమవుతాయి.
కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనెల్లో ఒకదానితో మెడకు మర్దన చేస్తే చర్మానికి రక్తప్రసరణ పెరిగి ముడతలు, గీతలు తగ్గిపోతాయి. మెడ మంచి ఛాయతో మెరుపుదనాన్ని సంతరించుకుంటుంది.
ముఖానికి రాసుకునే మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్, హైలురోనిక్ యాసిడ్ ఉన్న క్రిమ్‌లను మెడకు కూడా అప్లయ్ చేస్తూ ఉంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
మెడపై ముడతలు ఎక్కువగా ఉన్నవారు రోజూ మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. మెడను క్లాక్ వైజ్ డైరెక్షన్లో పదిసార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరో పది సార్లు తిప్పాలి. ఇలా చేయడం వల్ల ముడతలు క్రమంగా తగ్గుతాయి.
కలబంద గుజ్జులో కోడిగుడ్డు తెల్ల సొన లేదా ఇ విటమిన్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని మెడకు పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది
స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం, జంక్‌ఫుడ్ తినడం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌ను బాగా తగ్గించాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగాలి. రాత్రిపూట ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. అప్పుడే చర్మం బిగుతుగా మారి ముడతలు పడకుండా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..
Read Latest Telangana News and National News