వడదెబ్బ నుంచి తప్పించుకునేదెలా..!
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:34 AM
ఎండలో బయటికి వెళ్లేవారు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి పాటించాల్సిన...
ఎండలో బయటికి వెళ్లేవారు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి పాటించాల్సిన సులువైన చిట్కాల గురించి ఇలా చెబుతున్నారు...
తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి. అప్పుడే చెమట రూపంలో నీరు బయటికి వెళ్లినప్పటికీ శరీరంలో తగినంత తేమ నిలిచి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రణలో ఉంటుంది.
ఎండ వల్ల చెమట అధికంగా ఏర్పడి శరీరంలో ఎలకో్ట్రలైట్లు తగ్గుతాయి. దీంతో తలనొప్పి, కళ్లు తిరగడం లాంటి సమస్యలతో వడదెబ్బ తగలవచ్చు. అలాంటప్పుడు కొబ్బరి నీళ్లు, పలుచని మజ్జిగ, ఆమ్ పన్నా, నిమ్మరసం తాగితే ఉపశమనంగా ఉంటుంది. అలసట తీరి తక్షణ శక్తి లభిస్తుంది.
ఎండాకాలంలో తేలికగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. కాటన్, లెనిన్ ఫ్యాబ్రిక్‌లు శరీరానికి చల్లదనాన్నిస్తాయి. తెలుపు, లేత నీలం, లేత పసుపు రంగుల దుస్తులు తాజా అనుభూతినిస్తాయి. నైలాన్, పాలిస్టర్ లాంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన దుస్తులను ధరించకూడదు.
తరచూ పుచ్చకాయ, కర్బూజా, కీర, నారింజ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లు తినాలి. చెరుకు గడలు నమలడం కూడా మంచిదే. బీర, సొర, దోస, గుమ్మడికాయలతోపాటు ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, సోంపులనుకూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి వడదెబ్బను దరికి చేరనివ్వవు.
శరీరంలో డీహైడ్రేషన్ స్థాయిని పెంచే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదు. అలాగే చక్కెర, మసాలాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకూడదు.
శరీర ఉష్ణోగ్రత పెరిగినట్లనిపిస్తే పలుచని రుమాలులో కొన్ని ఐస్ క్యూబ్స్ చుట్టి నుదురు, మెడ, ఛాతి, చేతులు, పాదాల మీద మెల్లగా మర్దన చేయాలి.
వేసవికాలంలో మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో బయటికి వెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే తలకు స్కార్ప్ లేదా క్యాప్, కళ్లకు సన్ గ్లాసెస్ ధరించాలి. వెంట వాటర్‌బాటిల్ తీసుకెళ్లాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International