వానపాములతో ఇబ్బందా..?
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:02 AM
వర్షాకాలంలో తరచూ వంటింటి సింక్‌లో, హాల్లోని వాష్ బేసిన్‌లో, బాత్రూమ్‌లో, పూల కుండీల్లో వానపాములు కనిపిస్తుంటాయి. వీటిని సులువైన సురక్షితమైన చిట్కాలతో ఎలా నిలువరించాలో చూద్దాం...
వర్షాకాలంలో తరచూ వంటింటి సింక్‌లో, హాల్లోని వాష్ బేసిన్‌లో, బాత్రూమ్‌లో, పూల కుండీల్లో వానపాములు కనిపిస్తుంటాయి. వీటిని సులువైన సురక్షితమైన చిట్కాలతో ఎలా నిలువరించాలో చూద్దాం...
నిరంతరం కురిసే వర్షాల వల్ల నేలలో తేమ అధికంగా పెరగడంతో వానపాములు పైకి వచ్చేస్తుంటాయి. వీటిని ఆపేందుకు బాత్రూమ్, సింక్‌లలో తడిలేకుండా చూసుకోవాలి. పూల కుండీల్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వానపాములు కనిపించగానే వాటిపై ఉప్పు చల్లడం, యాసిడ్ లేదా రసాయన భరితమైన లిక్విడ్లు స్ర్పే చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల మట్టి లేదా నేల స్వభావం మారుతుంది. మొక్కలకు హాని కలుగుతుంది. సింక్‌లు, బాత్రూమ్ టైల్స్, వాష్‌బేసిన్ల నాణ్యత దెబ్బతింటుంది.
కప్పు నీటిలో కప్పు వైట్ వెనిగర్ లేదా అయిదారు చుక్కల వేపనూనె వేసి కలిపి వానపాములు ఎక్కువగా కనిపించే చోట్ల స్ర్పే చేస్తే అవి దూరంగా వెళ్లి పోతాయి.
బకెట్ నీటిలో రెండు చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి కలిపి బాత్రూమ్‌లో చల్లినా ప్రయోజనం ఉంటుంది. సబ్బు నీరు, పలుచని బ్లీచ్ ద్రావణంతో కూడా మంచి ఫలితం కనిపిస్తుంది
ఒక మగ్గు నీటిలో చెంచా ఆవాల పొడి వేసి కలిపి ఆ నీటిని వానపాములు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో చల్లితే ఆ పరిసరాల్లో ఉన్నవన్నీ పైకి వచ్చేస్తాయి. ఆపైన వీటిని దూరంగా తరలించవచ్చు.
కిచెన్, బాత్రూమ్‌లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా వెంటిలేషన్ కిటికీలను ఏర్పాటు చేసుకోవాలి. పంపుల నుంచి నీటి లీకేజీ లేకుండా చూడాలి. ఇంట్లో డీహ్యుమిడిఫయర్‌ను వాడాలి. వీటివల్ల తేమ లేకుండా పొడి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి వానపాములు రావు.
డ్రెయిన్లలో తరచూ వేడినీటిని పోస్తుండాలి. వాటిపై డ్రెయిన్ కవర్లను పెట్టాలి.
గడపల వద్ద, టైల్స్ మధ్య, గోడల కింది అంచుల్లో ఉండే రంధ్రాలు, పగుళ్లను వాటర్‌ప్రూఫ్ సీలెంట్‌తో మూసివేయాలి.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News