Share News

కుండీలో మిర్చి మొక్కలు

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:44 AM

పచ్చిమిర్చి మొక్కలను ఇంటి పరిసరాల్లో, మిద్దెతోటలో లేదా బాల్కనీ కుండీలో సులువుగా పెంచుకోవచ్చు. ఆ వివరాలు...

కుండీలో మిర్చి మొక్కలు

పచ్చిమిర్చి మొక్కలను ఇంటి పరిసరాల్లో, మిద్దెతోటలో లేదా బాల్కనీ కుండీలో సులువుగా పెంచుకోవచ్చు. ఆ వివరాలు...

  • కనీసం పన్నెండు అంగుళాల లోతు ఉన్న వెడల్పాటి కుండీని తీసుకుని అడుగున రెండు రంధ్రాలు చేయాలి. అందులో సగానికి పైగా మట్టి, కొద్దిగా ఇసుక, తగినంత కంపోస్టు, కోకోపిట్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం తడిచేలా నీటిని పోయాలి. ఆపైన ఇంట్లో ఉన్న ఎండు మిర్చి లేదా పచ్చిమిర్చి గింజలను చల్లి రోజుకు రెండుసార్లు నీటిని చిలకరిస్తుంటే వారంలోపు చిన్న మొలకలు వచ్చేస్తాయి. ఈ మొలకలు నాలుగు నుంచి అయిదు అంగుళాలు పెరిగిన తరువాత వేర్వేరు కుండీల్లోకి మార్చాలి. ఒక్కో కుండీలో రెండు మొక్కలను మాత్రమే నాటాలి.

  • కుండీల్లో మట్టి తడారినట్లనిపిస్తేనే కొద్దిగా నీటిని చిలకరించాలి.

  • మొక్కలు పొడవుగా పెరుగుతున్నప్పుడు వాటి పై భాగాన్ని తుంచేస్తుండాలి. అప్పుడే కాండానికి అన్ని పక్కల నుంచి కొమ్మలు పెరిగి మొక్క గుబురుగా మారుతుంది.

  • పూలు పూస్తున్న సమయంలో ఈ మొక్కలకు రోజూ కనీసం ఆరు గంటలు ఎండ తగిలేలా చూడాలి. లేనిపక్షంలో పూలు రాలిపోతాయి. ఈ పూల నుంచే పచ్చి మిరపకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి.

ఇవి కూడా చదవండి:

WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ

అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్

సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!

Updated Date - Nov 05 , 2026 | 04:44 AM