Share News

ఆఫీసులో నిద్రమత్తు వదిలేదెలా..?

ABN , Publish Date - Jun 10 , 2026 | 02:38 AM

ఒక్కోసారి ఆఫీసులో పని చేస్తున్నా కూడా నిద్రమత్తుతో కళ్లు మూతలు పడుతుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి.....

ఆఫీసులో నిద్రమత్తు వదిలేదెలా..?

ఒక్కోసారి ఆఫీసులో పని చేస్తున్నా కూడా నిద్రమత్తుతో కళ్లు మూతలు పడుతుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి...

  • ఆఫీసులో నిద్ర ముంచుకొస్తుంటే కుర్చీలో నుంచి లేచి పావుగంటసేపు అటూ ఇటూ నడిస్తే చాలు. నిద్రమత్తు వదిలి చురుకుగా పనిచేయాలనిపిస్తుంది. కొద్దిసేపు ఇష్టమైన సంగీతాన్ని వినడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది.

  • డీహైడ్రేషన్‌ వల్ల వచ్చే అలసట కూడా నిద్రకు కారణం కావచ్చు. తరచూ నీరు తాగుతూ ఉంటే శరీరానికి శక్తి లభించి నిద్ర మత్తు తగ్గుతుంది.

  • ముఖం, కనురెప్పలపై చల్లటి నీటిని చిలకరించుకుంటే తాజా అనుభూతి కలిగి నిద్ర పోతుంది.

  • కుర్చీలో కూర్చుని కొద్దిసేపు స్ట్రెచ్చింగ్‌ వ్యాయామాలు చేస్తే కండరాలు విశ్రాంతి పొంది మంచి ఫలితాన్నిస్తాయి.

  • రెండు నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలడం వల్ల మెదడు చురుకుగా మారి నిద్రను పోగొడుతుంది.

  • మధ్యాహ్న సమయంలో ఆహారాన్ని మితంగా తీసుకుంటూ ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒక కప్పు బ్లాక్‌ కాఫీ తాగినా నిద్ర మత్తు తగ్గి ఉత్సాహంగా అనిపిస్తుంది.

  • రాత్రిపూట కనీసం ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రిస్తే పగలు ఆఫీసులో నిద్ర రాదు.

  • ఆఫీసు టేబుల్‌ వద్ద మసక వెలుతురు కాకుండా మంచి లైటింగ్‌ ఉండేలా చూసుకోవాలి. అలాగే పుదీనా, నిమ్మ వాసనలతో కూడిన డిఫ్యూజర్‌ను ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Jun 10 , 2026 | 02:38 AM