ప్రొటీన్ల కోసం...
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:28 AM
వయసు పెరిగేకొద్దీ శరీరంలో కణాల నిర్మాణాన్ని, కండరాల ద్రవ్యరాశిని కాపాడేందుకు ప్రొటీన్లు తప్పనిసరి. రోజూ శరీరానికి...
వయసు పెరిగేకొద్దీ శరీరంలో కణాల నిర్మాణాన్ని, కండరాల ద్రవ్యరాశిని కాపాడేందుకు ప్రొటీన్లు తప్పనిసరి. రోజూ శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు లభించాలంటే తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకుందాం...
అల్పాహారంలో...
పోహా మంచి ఎంపిక. అందులో... ముందుగా నానబెట్టి ఉడికించిన పప్పులు, మొలకలు, వేయించిన పల్లీలు, పనీర్ ముక్కలు కలుపుకుంటే రుచి పెరగడమే కాకుండా వంటకం ప్రొటీన్లతో నిండుతుంది. అలాగే కిచిడీని వండేటప్పుడు బియ్యాన్ని తగ్గించి తాజా కూరగాయలు, మీల్‌మేకర్, పప్పులు, గింజలను చేరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
భోజనంలో...
శాకాహారులైతే రాజ్‌మా, కందిపప్పు, పెసరపప్పు, పచ్చి బఠాణీలు, పనీర్, సోయాబీన్స్‌తో తయారుచేసిన వంటకాలు చేర్చుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలను కూడా ఎక్కువగా తినాలి. రోజూ కప్పు పెరుగును తీసుకోవాలి. మాంసాహారులైతే చికెన్, చేపలు, రొయ్యలు, రెడ్‌మీట్‌తో తయారుచేసిన వంటకాలను తినాలి.
స్నాక్స్‌లో...
నానబెట్టిన కాబూలీ శనగలు, కిడ్నీ బీన్స్, పెసలు తదితరాలతో కూడిన మొలకలను సలాడ్స్‌లో కలుపుకుని తినవచ్చు. శనగపిండి వంటకాలు, ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవచ్చు. నేతిలో వేయించిన ఫూల్ మఖానా, బాదం పప్పులు, గుమ్మడి గింజలు, పల్లీ చిక్కీ, నువ్వుల లడ్డూ, ఉడికించిన సోయా చంక్స్ తదితరాలను తీసుకోవడం మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి..
మౌనాన్ని బలహీనతగా.. సహనాన్ని భయంగా భావించవద్దు: కోట రుక్మిణి
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి