Share News

క్యాన్సర్‌ కారకాలు మన ఇళ్లలోనే

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:32 AM

ఇంటి బయటి క్యాన్సర్‌ కారకాల నుంచి తప్పించుకోలేం! కానీ ఇంటి లోపలి క్యాన్సర్‌ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి మన ఇళ్లలో తిష్ఠ వేసుకున్న ఆ...

క్యాన్సర్‌ కారకాలు మన ఇళ్లలోనే

ఇంటి బయటి క్యాన్సర్‌ కారకాల నుంచి తప్పించుకోలేం! కానీ ఇంటి లోపలి క్యాన్సర్‌ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి మన ఇళ్లలో తిష్ఠ వేసుకున్న ఆ కారకాలను వెతికి, వదిలించుకుందాం!

ప్లాస్టిక్‌ డబ్బాలు: ప్లాస్టిక్‌ వేడెక్కకుండా ఉన్నంత కాలం వాటితో ప్రమాదం ఉండదనుకుంటే పొరపాటు. కొన్ని ప్లాస్టిక్స్‌ చల్లగా ఉన్నా వాటిలోని బిస్ఫినాల్‌ఎ, థాలేట్స్‌ను విడుదల చేస్తూనే ఉంటాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులకు కారణమయ్యే ఈ విషపూరిత రసాయనాలు దీర్ఘకాలంలో క్యాన్సర్లకు దారి తీస్తాయి

నాన్‌ స్టిక్‌: పాతవైనా, దెబ్బతిన్నవైనా వాటి పైపూతల నుంచి, పాలీఫ్లోరోఆల్కైల్‌ అనే ఫరెవర్‌ కెమికల్స్‌ విడుదల అవుతూనే ఉంటాయి. పాలీఫ్లోరోఆల్కైల్‌కు బహిర్గతమవడం వల్ల, మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది

అల్యూమినియం ఫాయిల్‌: ఆమ్లసహిత లేదా ఉప్పుతో కూడిన పదార్థాలతో కలిపి ఈ అల్యూమినియం ఫాయిల్‌ను ఉపయోగం, అల్యూమినియం లీచింగ్‌కు దారి తీస్తుంది. అల్యూమినియంకు ఎక్కువగా బహిర్గతమవడం వల్ల ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌, ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతాయి.

రిఫైన్డ్‌ నూనెలు: సోయాబీన్‌, కార్న్‌ మొదలైన అత్యధిక రిఫైన్డ్‌ నూనెలు వేడెక్కగానే, సులభంగా ఆక్సిడైజ్‌ అవుతాయి. దాంతో ఆల్డిహైడ్స్‌ అనే విషపూరిత సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ నూనెలతో, దీర్ఘకాలంలో క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది

ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలు: వేసవిలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్‌లో ఈ సీసాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ సీసాలు ఎండకు బహిర్గతమైతే బిస్ఫినాల్‌ఎతో పాటు సూక్ష్మప్లాస్టిక్స్‌, థాలేట్స్‌ను నీళ్లలోకి విడుదల చేస్తాయి. ఇవన్నీ హార్మోన్ల అవకతవకలకూ, క్యాన్సర్‌ ముప్పుకూ దారి తీస్తాయి. కాబట్టి నీళ్ల నిల్వకు బిపిఎ ఫ్రీ కోవకు చెందిన ప్లాస్టిక్‌ డబ్బాలనే వాడుకోవాలి

సెంటెడ్‌ క్యాండిల్స్‌: ఇటీవలి కాలంలో ఈ పోకడ బాగా పెరిగింది. అయితే వీటి నుంచి బెంజీన్‌, టోలీన్‌ మొదలైన విష వాయువులు వెలువడతాయి.

దీర్ఘకాలికంగా వీటికి బహిర్గతమైతే, లుకేమియా ముప్పు పెరుగుతుంది చాపింగ్‌ బోర్డ్స్‌: కత్తితో కోసేటప్పుడు, ఈ బోర్డుల్లోని మైక్రోప్లాస్టిక్స్‌ కూరగాయల్లో కలుస్తాయి. దాంతో తీవ్రమైన ఇన్‌ఫ్లమేషన్‌, క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 12:32 AM