గుండెపోటుకు ముందు...
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:30 AM
ఛాతీ నొప్పి, ఎడమ చేతిలో అసౌకర్యం, శ్వాసలో ఇబ్బంది... సాధారణంగా గుండెపోటుకు ముందు ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ మహిళల్లో...
విమెన్స్ హెల్త్
ఛాతీ నొప్పి, ఎడమ చేతిలో అసౌకర్యం, శ్వాసలో ఇబ్బంది... సాధారణంగా గుండెపోటుకు ముందు ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ మహిళల్లో గుండెపోటు లక్షణాలు కాస్త భిన్నంగా ఉంటాయి.
గుండె నొప్పిని మెదడుకు చేరవేసే నాడులు, దవడ, మెడ, వెన్ను పైభాగాల నాడులతో ముడిపడి ఉంటాయి. పురుషులతో పోల్చితే, మహిళల్లో గుండె పోటు ఈ మూడు ప్రదేశాల నొప్పులతో మొదలవుతుంది. కాబట్టి మహిళలు అలసటతో పాటు ఈ మూడు ప్రాంతాల్లో తలెత్తే నొప్పులను నిర్లక్ష్యం చేయకూడదు. కొందరు మహిళల్లో గుండె పోటు జీర్ణ సంబంధ లక్షణాలతో బహిర్గతమవుతూ ఉంటుంది. గుండె సమస్యతో రక్తప్రవాహం తగ్గడం వల్ల అజీర్తి, పొట్ట నిండుగా ఉన్న భావన కలగడం, పైపొట్టలో ఒత్తిడి మొదలవుతాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మహిళలు యాంటాసిడ్లను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ మరీ ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలు... అలసటతో పాటు దవడ లేదా వెన్నులో నొప్పి, వివరించడానికి వీల్లేని వికారం తలెత్తితే, వెంటనే అప్రమత్తం కావాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్