Share News

తోట పనితో ఆరోగ్యం

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:37 AM

మొక్కల పెంపకం వల్ల ఇంటి అందం పెరగడమే కాదు మంచి ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. తోటపని చేయడం వల్ల కలిగే...

తోట పనితో ఆరోగ్యం

మొక్కల పెంపకం వల్ల ఇంటి అందం పెరగడమే కాదు మంచి ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. తోటపని చేయడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలివే...

  • మొక్కలకు నీళ్లు పోయడం, కలుపు తీయడం, మట్టి మార్చడం, ఎరువులు తయారుచేయడం, వాటిని మొక్కలకు అందించడం అనేవి తోటపనిలో ప్రధానమైనవి. రోజూ ఈ పనులు చేస్తూ ఉంటే శారీరకంగా శ్రమ కలుగుతుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. వేళకు ఆకలి వేస్తుంది. జీవక్రియలన్నీ సక్రమంగా జరిగి ఉత్సాహంగా అనిపిస్తుంది. నిద్రలేమి సమస్య తీరుతుంది.

  • తోటపని చేసేటప్పుడు ఎక్కువ సమయం ఎండలో గడపాల్సి వస్తుంది. దీంతో శరీరానికి కావాల్సిన డి విటమిన్‌ అందుతుంది. చర్మ కణాల్లో మెలనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌లా పనిచేసి ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

  • మొక్కల మధ్య గడపడం వల్ల శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా పెరిగి మెదడు పనితీరు మెరుగుపడుతుంది. దీంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒత్తిడి, ఆందోళన మాయమవుతాయి. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.

  • తోటపని చేసేటప్పుడు తరచూ వంగడం, లేవడం, నడవడం చేయాల్సి వస్తుంది. వీటివల్ల ఊబకాయం అదుపులోకి వస్తుంది. శరీరంలోని ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి.

  • రోజూ కొద్దిసేపు తోటపని చేస్తూ ఉంటే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం లాంటి సమస్యలు దరి చేరవు.

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 12:37 AM