Share News

వ్యాయామంతో అల్జీమర్స్‌కు అడ్డుకట్ట

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:09 AM

వ్యాయామం... ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి, మెదడు చురుకుదనాన్ని పెంచి అల్జీమర్స్‌ ముప్పును తగ్గించే కాలేయ ఎంజైమ్‌ను ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు....

వ్యాయామంతో అల్జీమర్స్‌కు అడ్డుకట్ట

తెలుసుకుందాం

వ్యాయామం... ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి, మెదడు చురుకుదనాన్ని పెంచి అల్జీమర్స్‌ ముప్పును తగ్గించే కాలేయ ఎంజైమ్‌ను ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు.

అల్జీమర్స్‌ వ్యాధి క్రమేపీ జ్ఞాపకశక్తిని క్షీణింపచేస్తుంది. మెదడులో ఇన్‌ఫ్లమేషన్‌కూ, హానికారక పదార్థాలు రక్తంలో కలిసిపోయుండా నియంత్రించే బ్లడ్‌ బ్రెయిన్‌ బ్యారియర్‌కూ అల్జీమర్స్‌తో సన్నిహిత సంబంధం ఉంటుంది. వయసు పైబడేకొద్దీ ఈ బ్యారియర్‌ బలహీనపడుతుంది. అయితే వ్యాయామంతో పైబడే వయసు ప్రభావం మెదడు మీద పడకుండా నియంత్రించుకోవచ్చనీ, తద్వారా అల్జీమర్స్‌ నుంచి రక్షణ పొందవచ్చనీ యూనివర్శిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాలో చేపట్టిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. వ్యాయామం వల్ల జిపిఎల్‌డి 1 అనే ఎంజైమ్‌ కాలేయం నుంచి విడుదలవుతోందనీ, దాంతో పాటే జ్ఞాపకశక్తి కూడా మెరుగు పడుతోందనీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎంజైమ్‌ రక్తం ద్వారా మెదడుకు చేరుకోకుండానే ఫలితాన్ని కనబరుస్తూ ఉండడంతో, మరింత లోతుగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు, ఎంజైమ్‌ మెదడు బయటే ప్రమాదకరమైన టిన్యాప్‌ అనే ప్రొటీన్‌ను తొలగిస్తూ ఉండడంతో, జ్ఞాపకశక్తి మెరుగుదల సాధ్యపడుతున్నట్టు కనిపెట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 12:09 AM