Share News

చెమట తగ్గేదెలా!

ABN , Publish Date - May 23 , 2026 | 06:00 AM

వేసవికాలంలో ఎండ వేడి, ఉక్కపోతల కారణంగా ఒంటిపై విపరీతంగా చెమట పట్టి చిరాగ్గా అనిపిస్తుంటుంది. వీటినుంచి తప్పించుకోవడానికి ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం...

చెమట తగ్గేదెలా!

వేసవికాలంలో ఎండ వేడి, ఉక్కపోతల కారణంగా ఒంటిపై విపరీతంగా చెమట పట్టి చిరాగ్గా అనిపిస్తుంటుంది. వీటినుంచి తప్పించుకోవడానికి ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం...

  • యాంటీ బ్యాక్టీరియల్‌ సబ్బుతో రోజుకు రెండుసార్లు స్నానం చేస్తే చెమట, దుర్వాసన, చికాకు తగ్గుతాయి.

  • స్నానం చేసిన తరువాత శరీరాన్ని తడిలేకుండా పొడిగా ఉండేలా పలుచని తువాలుతో తుడుచుకోవాలి. దీనివల్ల చర్మంపై చెమట ఉత్పత్తి తగ్గుతుంది.

  • చెమట ఎక్కువగా పట్టే చోట తేమను పీల్చుకునే పౌడర్‌ను రాసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.

  • శరీరాన్ని అంటిపెట్టుకుని బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా కాస్త వదులుగా ఉండేవాటిని ధరించడం మంచిది. కాటన్‌, లెనిన్‌ దుస్తులు అయితే సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి చెమటను త్వరగా పీల్చుకుని శరీరానికి గాలి తగిలేలా చేస్తాయి.

  • కొంతమందికి పాదాలకు అధికంగా చెమట పడుతుంటుంది. వీరు గాలి సులువుగా ప్రసరించడానికి వీలుగా ఉండే కాటన్‌ సాక్స్‌లు ఽధరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

  • తరచూ మంచినీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల చెమట ఉత్పత్తి తగ్గుతుంది

  • ఒత్తిడి, ఆందోళనల వల్ల కూడా శరీరంలో వేడి పెరిగి చెమట అధికంగా పడుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.

  • మసాలా దినుసులు, కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినడం తగ్గించాలి.

ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - May 23 , 2026 | 06:00 AM