Share News

సెనగలు తినాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:20 AM

కండరాల బలహీనత వల్ల తలెత్తే నొప్పులకు సెనగలే చక్కని విరుగుడు. ఈ పోషకభరిత ఆహారంతో వెన్ను దృఢంగా మారుతుంది. అదెలాగంటే...

సెనగలు తినాలి

పోషక భాండాగారం

కండరాల బలహీనత వల్ల తలెత్తే నొప్పులకు సెనగలే చక్కని విరుగుడు. ఈ పోషకభరిత ఆహారంతో వెన్ను దృఢంగా మారుతుంది. అదెలాగంటే...

కండరపుష్ఠి: వీటిలో వృక్షాధారిత మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల నల్ల సెనగల్లో 20 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. కాబట్టి సెనగలు తినడం వల్ల వెన్నుకు దన్నుగా నిలిచే కండరాలు బలపడతాయి

ఎముక సాంద్రత: వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజలవణాల సమ్మేళనం ఎముక సాంద్రతను పెంచుతుంది. ఆస్టియొపొరోసిస్‌, వెన్ను నొప్పుల ముప్పు నుంచి తప్పిస్తుంది

కనెక్టివ్‌ టిష్యూ: సెనగల్లోని ఐరన్‌... ఎముకలు, కీళ్లు, లిగమెంట్లకు బలాన్నీ, ఎలాస్టిసిటీని అందించే ప్రొటీన్‌ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది

ఇన్‌ఫ్లమేషన్‌: యాంటీఆక్సిడెంట్స్‌, ఫైటోకెమికల్స్‌ తీవ్రమైన నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. దాంతో కీళ్ల నొప్పులు, కండరాల అసౌకర్యాలు తగ్గుతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 12:20 AM