నెయ్యితో ఆరోగ్యం
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:49 AM
రోజుకు రెండు చెంచాల నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...
రోజుకు రెండు చెంచాల నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...
నెయ్యిలో ఉండే మీడియం చైన్ ట్రై గ్లిజరైడ్‌లు, ఫ్యాటీ యాసిడ్లు కలిసి శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. బద్దకాన్ని, నీరసాన్ని తగ్గించి రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడతాయి.
నెయ్యిని తీసుకున్న వెంటనే జీర్ణాశయంలో ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ వేగవంతమవుతుంది. అజీర్తి, మలబద్దకం, కడుపులో ఆమ్లత్వం లాంటి సమస్యలు తీరుతాయి. ఉదయాన్నే పరగడుపున ఓ గ్లాసు గోరువెచ్చటి నీటిలో అరచెంచా నెయ్యి కలుపుకుని తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి వెళతాయి.
నెయ్యిలో అధికంగా ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు.. మెదడును చురుకుగా మారుస్తాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తితోపాటు ఆలోచన శక్తిని పెంచుతాయి. పిల్లలకు, వృద్ధులకు మంచి ఫలితాలను అందిస్తాయి.
నెయ్యిలోని కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్.. శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తరచూ నెయ్యిని తీసుకుంటుంటే శరీరానికి కావాల్సిన ఎ, డి, ఇ, కె విటమిన్లు పుష్కలంగా అందుతాయి. దీంతో చర్మం తేమతో నిండి బిగుతుగా, నున్నగా కాంతివంతంగా మారుతుంది. కాల్షియం శోషణ పెరిగి ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. కంటి సమస్యలు తీరుతాయి.
ఇవి కూడా చదవండి:
WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ
అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!