కురులకు కరివేపాకు...
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:35 AM
శిరోజాల సంరక్షణ కోసం కరివేపాకును ఏ నూనెతో కలిపి ఏ విధంగా తలకు పట్టించాలో చూద్దాం...
శిరోజాల సంరక్షణ కోసం కరివేపాకును ఏ నూనెతో కలిపి ఏ విధంగా తలకు పట్టించాలో చూద్దాం...
ఒక కప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి వేడిచేసి ఆపైన చల్లార్చి వడబోసి సీసాలో భద్రపరచుకోవాలి. రోజూ రాత్రి పడుకునేముందు చిన్న గంటెలో కొద్దిగా నూనెను తీసుకుని గోరువెచ్చగా వేడిచేసి మాడుమీద, శిరోజాలకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మాడు పొడిబారడం, చుండ్రు తగ్గుతాయి. కరివేపాకులోని కొవ్వు ఆమ్లాలు కొబ్బరినూనెలోని ప్రొటీన్లు కలిసి కుదుళ్లను బలోపేతం చేస్తాయి. దీంతో శిరోజాలు పట్టులా మెరుస్తూ ఒత్తుగా పెరుగుతాయి.
తలలో ఎక్కువగా జిడ్డు పట్టే సమస్య ఉన్నవారికి జోజోబా ఆయిల్ మంచి ఎంపిక. చిన్న గిన్నెలో అర కప్పు జోజోబా ఆయిల్‌ను తీసుకుని వేడిచేసి అందులో కొద్దిగా కరివేపాకు వేసి గంటసేపు నాననివ్వాలి. ఆపైన సీసాలోకి వడబోసుకోవాలి. తలస్నానానికి అరగంట ముందు ఈ నూనెను తలకు పట్టించి సున్నితంగా మర్దన చేసుకుంటే మాడు మీద రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో తగిన పోషణ అంది శిరోజాలు ఒత్తుగా పొడవుగా పెరుగుతాయి.
కప్పు బాదం నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి చిన్న మంటమీద పది నిమిషాలు వేడిచేయాలి. ఆపైన చల్లార్చి గాజు సీసాలోకి వడబోయాలి. ఈ నూనెను తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేస్తే శిరోజాలు నిర్జీవంగా మారడం, రాలడం, చివర్లు చిట్లడం లాంటి సమస్యలు తీరుతాయి. బాదం నూనెలోని ఇ విటమిన్, ప్యాటీ యాసిడ్లు కరివేపాకులోని బి విటమిన్, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి శిరోజాలకు నల్లని రంగును అందించే మెలనోసైట్లను పటిష్టపరుస్తాయి. దీంతో శిరోజాలు నెరిసే ప్రక్రియ నెమ్మదిస్తుంది.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News