Share News

పొడవు పెరగడం లేదా?

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:51 AM

పిల్లలు వయసుకు తగ్గట్టు పొడవు పెరగాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేంటంటే...

పొడవు పెరగడం లేదా?

పిల్లలు వయసుకు తగ్గట్టు పొడవు పెరగాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేంటంటే...

  • పిల్లలు పొడవవ్వాలంటే ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండాలి. అందుకు డి విటమిన్‌ దోహదం చేస్తుంది. ఇది ఎక్కువగా లభించే పాలు, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులను పిల్లల ఆహారంలో చేర్చాలి. రోజూ ఉదయం పిల్లలు కొద్దిసేపు ఎండలో గడిపేలా చూడాలి. అలాగే ఎముకల్లో సాంద్రతను పెంచే బ్రోకలీ, పాలకూర, క్యాబేజీలను కూడా తినిపించాలి.

  • సి విటమిన్‌... పిల్లల పెరుగుదలకు తోడ్పడే హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఆరోగ్యకరమైన కణజాల నిర్మాణానికి తోడ్పడుతుంది. సి విటమిన్‌ ఎక్కువగా లభించే నారింజ, జామకాయలను పిల్లలచేత తినిపించాలి. అలాగే ఉసిరి, నిమ్మకాయ, టమాటాలను ఆహారంలో చేర్చాలి.

  • రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఆరోగ్యంగా ఎదిగేందుకు ఎ విటమిన్‌ సహకరిస్తుంది. దీనికోసం కేరట్లు, బొప్పాయి, తాజా ఆకుకూరలు, పండ్లను పిల్లలకు తరచూ తినిపిస్తూ ఉండాలి.

  • జంక్‌ ఫుడ్‌వల్ల పిల్లల్లో పెరుగుదల మందగిస్తుంది. వీలైనంతవరకు వీటికి దూరంగా ఉంచండి.

  • రోజుకు అరగంట చొప్పున వారానికి నాలుగు రోజుల పాటు పిల్లలచేత తేలికపాటి వ్యాయామం చేయించాలి. ఆటలు ఆడించాలి. ప్రొటీన్లు, ఖనిజాలు, మినరల్స్‌తో కూడిన సమతులాహారాన్ని పిల్లలకు అందించాలి.

Also Read:

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..

కష్టపడి పని చేసేవారికి అవకాశాలు పుష్కలం: నారా భువనేశ్వరి

For More Latest News

Updated Date - Mar 26 , 2026 | 12:51 AM