Share News

గర్భం ధరించగలనా? లేనా?

ABN , Publish Date - Feb 12 , 2026 | 04:08 AM

గర్భం ధరించే వీలు ఉందా, లేదా అని ఎవరికి వారు గ్రహించాలంటే, కొన్ని ముఖ్యమైన అంశాల మీద అవగాహన పెంచుకోవాలి. గర్భం దాల్చే అవకాశాలు పెరిగే వయసుతోపాటు తరుగుతూ ఉంటాయి. మెనార్కీకి...

గర్భం ధరించగలనా? లేనా?

డాక్టర్‌ నా వయసు 30. ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. అయితే నాలో గర్భం దాల్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవాలని ఉంది. ఎలా సాధ్యపడుతుందో వివరించగలరు?

ఓ సోదరి, హైదరాబాద్‌

గర్భం ధరించే వీలు ఉందా, లేదా అని ఎవరికి వారు గ్రహించాలంటే, కొన్ని ముఖ్యమైన అంశాల మీద అవగాహన పెంచుకోవాలి. గర్భం దాల్చే అవకాశాలు పెరిగే వయసుతోపాటు తరుగుతూ ఉంటాయి. మెనార్కీకి (మొదటి నెలసరి) చేరుకునేటప్పటికి మహిళల్లో 3 నుంచి 4 మిలియన్ల అండాలు ఉంటే, వయసుతోపాటు తగ్గుతూ 30 ఏళ్ల వయసుకు చేరుకునేసరికి ఇంకా తగ్గిపోతాయి. 35 ఏళ్లు దాటేటప్పుటికి 25 వేల అండాలే మిగులుతాయి. కాబట్టి 30 ఏళ్ల లోపే గర్భం దాల్చాలి. ఒకవేళ 30 ఏళ్లొస్తే గర్భధారణకు ఒక 1 నుంచి 2 ఏళ్లకు మించి ఆగకూడదు. ఈ వ్యవధిలో ఒకసారి వైద్యులను కలిసి గర్భధారణకు సంబంధించిన ఆరోగ్యంగా ఉన్నారో, లేదో నిర్ధారించుకోవాలి. స్కానింగ్‌ ద్వారా ఫైబ్రాయిడ్‌, ఎండోమెట్రియాసిస్‌ లేదని నిర్ధారించుకోవాలి. భర్త సెమెన్‌ కౌంట్‌, భార్యలో అండాలు విదులయవుతున్నాయా? థైరాయిడ్‌ సమస్యలేమైనా ఉన్నాయా?.. ఈ పరీక్షలతో గర్భధారణ అవకాశాన్ని లెక్కించవచ్చు. ఈ పరీక్షలన్నీ సక్రమంగానే ఉండి ‘అన్‌ఎక్స్‌ప్లెయిన్‌డ్‌ రీజన్స్‌’ వల్ల గర్భధారణ జరగట్లేదని అనిపించినా, మరో ఏడాదిపాటు ఆగవచ్చు. 35 ఏళ్లు దాటితే వెంటనే గర్భం దాల్చాలి.

డాక్టర్‌ సునీత ఇలినాని

కన్సల్టెంట్‌ అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ

(ఆర్ట్‌ అండ్‌ ఇన్‌ఫెర్టిలిటీ) స్పెషలిస్ట్‌,

హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 04:08 AM