Share News

గుడ్లు ఉడికించిన నీటిలో పోషకాలు

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:14 AM

కోడిగుడ్ల పెంకుల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ గుడ్లు ఉడకబెట్టినప్పుడు నీటిలోకి చేరుతాయి. పోషకాలతో నిండిన ఈ నీటిని...

గుడ్లు ఉడికించిన నీటిలో పోషకాలు

కోడిగుడ్ల పెంకుల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ గుడ్లు ఉడకబెట్టినప్పుడు నీటిలోకి చేరుతాయి. పోషకాలతో నిండిన ఈ నీటిని పారబోయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...

  • గుడ్లు ఉడికించిన నీరు మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది. దీనిలోని కాల్షియం... మొక్కల వేర్లను బలోపేతం చేస్తుంది. అలాగే పొటాషియం.. పూలు విరగబూయడానికి తోడ్పడుతుంది. టమాటా, మిర్చి, గులాబీ, చామంతి మొక్కలకు ఈ నీటిని చల్లార్చి అందిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కంపో్‌స్టలో ఈ నీటిని కలిపితే మట్టి పోషకాలతో నిండుతుంది. దీంతో మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

  • గుడ్లు ఉడకబెట్టిన నీరు శిరోజాల సంరక్షణకు కూడా తోడ్పడుతుంది. తలస్నానం చేసిన తరువాత ఈ నీటితో శిరోజాలను కడిగితే అవి మృదువుగా మారి మెరుపుదనం సంతరించుకుంటాయి. ఈ నీటిని మాడుకు పట్టిస్తే చుండ్రు మాయమవుతుంది. అలాగే ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తే చర్మం తేమతో నిండి బిగుతుగా తాజాగా మారుతుంది.

  • గుడ్లను ముందుగా శుభ్రం చేసి ఉడికిస్తే ఆ నీటిని వంటల్లో వాడుకోవచ్చు. సూప్‌లు, కూరలు, రసం, సాంబార్‌ లాంటివాటిలో ఉపయోగించుకోవచ్చు. కాల్షియం లోపం ఉన్నవారికి ఈ నీరు సహజ సప్లిమెంట్‌లా పనిచేస్తుంది. కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువులకు కూడా ఈ నీటిని కొద్ది పరిమాణంలో తాగించవచ్చు.

  • గుడ్లు ఉడకబెట్టిన నీటితో స్టీల్‌ పాత్రలను తోమితే జిడ్డు, మాడు మరకలు వదిలి అవి చక్కగా మెరుస్తాయి. కుక్కర్లు, తవాలు, ఇనప పాత్రలను కూడా తేలికగా శుభ్రం చేయవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 04:14 AM