మీకు తెలుసా!
ABN , Publish Date - Feb 04 , 2026 | 01:36 AM
నల్లని ఎండు ద్రాక్ష నీళ్లు కూడా ఔషధంలా పని చేస్తాయని మీకు తెలుసా! ఈ నీటిలో ఐరన్, విటమిన్ బి పుష్కలం. ఇవి రక్తహీనతను దూరం పెడతాయి...
నల్లని ఎండు ద్రాక్ష నీళ్లు కూడా ఔషధంలా పని చేస్తాయని మీకు తెలుసా! ఈ నీటిలో ఐరన్, విటమిన్ బి పుష్కలం. ఇవి రక్తహీనతను దూరం పెడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తాయి. చెడు కొలె స్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫైబర్ అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. ఈ నీళ్లలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి చర్మ సమస్యలను దరి చేరనీయవు. పది నుంచి పదిహేను నల్ల ఎండు ద్రాక్షలను గ్లాసుడు నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. పరగడుపున ఆ నీటిని తాగాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్
బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్
For More TG News And Telugu News