గుబాళించే మొక్కలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:27 AM
సాయంత్రం వేళ అలాగే రాత్రి పూట ఇల్లంతా పూల సువాసనలతో గుబాళించాలంటే బాల్కనీలో, ఇంటి చుట్టూరా ఏ మొక్కలను పెంచాలో చూద్దాం...
సాయంత్రం వేళ అలాగే రాత్రి పూట ఇల్లంతా పూల సువాసనలతో గుబాళించాలంటే బాల్కనీలో, ఇంటి చుట్టూరా ఏ మొక్కలను పెంచాలో చూద్దాం...
నైట్ క్వీన్: రాత్రికాగానే చక్కని సువాసన వెదజల్లుతుందీ మొక్క. వర్షాకాలంలో దీనికి గుత్తులు గుత్తులుగా సన్నని మొగ్గలు వస్తుంటాయి. ఇవి సాయంత్రం కాగానే విచ్చుకుని రాత్రంతా పరిమళిస్తూనే ఉంటాయి. ఇంటి ముందు లేదా బాల్కనీ కుండీలో ఈ మొక్కను పెంచితే రాత్రంతా ఇల్లు గుబాళిస్తూనే ఉంటుంది. ఈ పూల వాసన కొద్దిగా ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి పడకగదికి కాస్త దూరంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. తగినంత ఎండ, నీరు అందితే చాలు మరే సంరక్షణ ఈ మొక్కకు అవసరం ఉండదు.
జాజి: ఈ మొక్కను ఇంటిముందు నేలలో నాటితే ఏపుగా పెరుగుతుంది. కుండీలో కూడా పెంచవచ్చు. దీనికి పూసే సన్నటి తెల్లని మొగ్గలు రాత్రిపూట వికసించి అహ్లాదకరమైన సువాసనను వ్యాప్తిచేస్తాయి. కుండీలో నీరు నిల్వ ఉండకుండా మట్టి తడిగా ఉండేలా చూసుకోవాలి. మొక్కకు రోజంతా ఎండ తగిలితే పూలు బాగా వస్తాయి. అదనంగా పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తుంటే మొక్క గుబురుగా పచ్చగా పెరుగుతుంది. వేసవి కాలం నుంచి వర్షాకాలం వరకు పూలు వస్తూనే ఉంటాయి.
పారిజాతం: ఈ మొక్కకు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం లేదు. లోతైన కుండీలో పెంచుకోవచ్చు. తెల్లటి రేకులు, నారింజ రంగు కాడలతో ఈ పూలు రాత్రిపూట వికసించి ఉదయానికల్లా నేలపై రాలుతుంటాయి. కాబట్టి ఈ మొక్కను ఇంటి ముందు ఓ పక్కగా నాటితే బాగుంటుంది. కొద్దిగా వెలుతురు సోకితే చాలు శీతాకాలమంతా చక్కగా పూలు పూస్తుంది. రాత్రంతా ఈ పూల సువాసన మృదువుగా ఉంటూ చక్కని అనుభూతినిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News