బాన పొట్ట కరిగేదెలా..?
ABN , Publish Date - Jun 11 , 2026 | 02:55 AM
శరీరంలో హార్మోన్ల మార్పులు, పోషకాహారం తీసుకోకపోవడం, ఒత్తిడి వల్ల పొట్టలో అధికంగా కొవ్వులు పేరుకుంటూ ఉంటాయి. వీటిని సులువుగా కరిగించే చిట్కాలివే...
శరీరంలో హార్మోన్ల మార్పులు, పోషకాహారం తీసుకోకపోవడం, ఒత్తిడి వల్ల పొట్టలో అధికంగా కొవ్వులు పేరుకుంటూ ఉంటాయి. వీటిని సులువుగా కరిగించే చిట్కాలివే...
పీచులు అధికంగా ఉండే ఓట్స్, మొలకలు, పప్పు ధాన్యాలు, అవిసెలను తరచూ ఆహారంలో చేర్చుకుంటే పొట్టలోని అదనపు కొవ్వులు క్రమంగా కరిగిపోతాయి.
కోడిగుడ్డు, చేపలు, బీన్స్ లాంటి ప్రోటీన్లు పుష్కలంగా లభించే పదార్థాలు తీసుకోవడం వల్ల జీవక్రియలు వేగవంతమై బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు, విటమిన్లతో నిండిన తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
స్వీట్లు, జంక్ ఫుడ్, కూల్‌డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను పూర్తిగా మానేయాలి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బానపొట్టకు కారణమవుతాయి.
డీప్ బ్రీతింగ్, యోగా, ధ్యానం, తేలికపాటి వ్యాయామాలను తరచూ చేస్తూ ఉంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత చేకూరి సమస్య తీరుతుంది.
ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్ వ్యాయామాలు చేసినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
రోజూ కనీసం ఆరుగంటలు ప్రశాంతంగా నిద్రిస్తే శరీరంలో హార్మోన్ల సమతౌల్యం పెరిగి బానపొట్ట తగ్గుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News