బార్లీ నీటిని తాగుదాం..!
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:14 AM
యాంటీ ఆక్సిడెంట్లు, బీటా గ్లూకాన్, పీచు, బీ విటమిన్లతో నిండిన బార్లీ నీరు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బార్లీ నీటిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం...
యాంటీ ఆక్సిడెంట్లు, బీటా గ్లూకాన్, పీచు, బీ విటమిన్లతో నిండిన బార్లీ నీరు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బార్లీ నీటిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం...
ముందుగా పావు కప్పు బార్లీ గింజలను శుభ్రంగా కడిగి అవి మునిగే వరకు నీటిని పోసి కనీసం అయిదు గంటలు నానబెట్టాలి. ఆపైన నీటిని వడగట్టి పారబోయాలి. జీర్ణ సమస్యలను కలిగిస్తుంది కాబట్టి ఈ నీటిని ఉపయోగించకూడదు. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి మూడు కప్పుల నీటిని పోసి మరిగించాలి. అందులో నానిన బార్లీ గింజలు వేసి చిన్న మంటమీద పావుగంటసేపు ఉడికించాలి. ఇవి మెత్తగా ఉడికిన తరువాత స్ట్రయినర్ సహాయంతో నీటిని వడబోసి చల్లార్చాలి. ఈ నీటిలో చెంచా నిమ్మరసం, రెండు చెంచాల తేనె కలుపుకుని తాగాలి. వేసవికాలంలో అయితే అందులో మూడు చెంచాల నానబెట్టిన సబ్జా గింజలు లేదా చియా సీడ్స్ కలుపుకోవచ్చు.
బార్లీ నీటిని తాగడం వల్ల మూత్రాశయ సమస్యలు తీరుతాయి. శరీరంలో పేరుకున్న వ్యర్థాలన్నీ మూత్ర విసర్జన ద్వారా బయటికి వెళతాయి. కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు
గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ
Read Latest TG Govt And Telugu News