Share News

మధుమేహులకు వరం బార్లీ

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:37 AM

డయాబెటి్‌సతో సతమతమవుతున్నారా? ఆహారంలో చిన్నపాటి మార్పులతో మీ షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో...

మధుమేహులకు వరం బార్లీ

డయాబెటి్‌సతో సతమతమవుతున్నారా? ఆహారంలో చిన్నపాటి మార్పులతో మీ షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో వాడుకలో ఉన్న బార్లీ మధుమేహ నివారణకు ఒక శక్తివంతమైన ఆయుధమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బార్లీలో పీచు పదార్థం (ఫైబర్‌), బీటా గ్లూకాన్స్‌, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీని గ్లైసమిక్‌ ఇండెక్స్‌(28-30) చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది.

  • భోజనం తర్వాత షుగర్‌ కంట్రోల్‌: సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. బార్లీలోని బయోయాక్టివ్‌ సమ్మేళనాలు ఈ వేగాన్ని నియంత్రించి రోజంతా శక్తిని స్థిరంగా ఉంచుతాయి.

  • ఇన్సులిన్‌ పనితీరు మెరుగుదల: మన శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించనప్పుడు షుగర్‌ పెరుగుతుంది. బార్లీని క్రమంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ సెన్సిటివిటీ మెరుగుపడి కణాలు చక్కెరను సమర్థవంతంగా వినియోగించుకుంటాయి.

  • బరువు తగ్గేందుకు: బార్లీలో ఉండే అధిక ఫైబర్‌ వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. స్థూలకాయం, మధుమేహం ఉన్న వారికి ఇది సరైన ఎంపిక.

  • గుండె ఆరోగ్యం: మధుమేహం ఉన్నవారికి గుండెజబ్బుల ముప్పు ఎక్కువ. బార్లీలోని పీచుపదార్థం గుండెను రక్షించడమే కాకుండా, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.

జాగ్రత్తలు కూడా అవసరం

జీర్ణ సమస్యలు: బార్లీని అధికంగా తీసుకుంటే గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావొచ్చు.

గ్లూటెన్‌ అలర్జీ: సిలియాక్‌ వ్యాధి లేదా గ్లూటెన్‌ పడనివారు బార్లీకి దూరంగా ఉండాలి.

థైరాయిడ్‌ సమస్యలు: థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకు దీనిని తీసుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 04:37 AM