చెడు కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:28 AM
గుండె జబ్బులు, పక్షవాతం లాంటి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరగకుండా ఉండేందుకు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో చూద్దాం...
గుండె జబ్బులు, పక్షవాతం లాంటి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరగకుండా ఉండేందుకు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో చూద్దాం...
తరచూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవాలి. దీనిలోని అల్లిసిన్ సమ్మేళనం, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి రక్తంలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ను పూర్తిగా కరిగిస్తాయి.
ఉదయం లేదా రాత్రి సమయాల్లో పసుపు కలిపిన గోరువెచ్చటి పాలు తాగడం, వంటకాల్లో విధిగా పసుపు వేయడం అలవాటు చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపులోని కర్కుమిన్ సమ్మేళనం సమస్యను నిరోధిస్తుంది.
వారానికి రెండుసార్లు పచ్చి ఉల్లిపాయను తినడం మంచిది. దీనిలోని సల్ఫర్, ఫ్లేవనాయిడ్స్ కలిసి రక్తంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెకు రక్షణ కల్పిస్తాయి.
రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగుతుంటే దానిలోని కెటాచిన్స్ ప్రభావవంతంగా పనిచేసి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను చేరనివ్వవు.
వారానికోసారి వంటకాల్లో సలాడ్స్‌లో ఆలివ్ ఆయిల్‌ను చేర్చుకుంటే దానిలోని మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్‌లు ప్రయోజనాన్ని అందిస్తాయి.
రోజుకు ఒక యాపిల్ తిన్నా సమస్య ఏర్పడదు. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పీచు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను శోషించుకుని రక్తంలో లిపిడ్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రోజూ బాదం, వాల్‌నట్స్, గుమ్మడి, అవిసె గింజలను తింటుంటే వాటిలోని మెగ్నీషియం, పాలిఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ కలిసి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తనాళాలను శుభ్రం చేస్తాయి.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News