Share News

ఏసీ కూలింగ్‌ రావట్లేదా?

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:09 AM

వేసవి ప్రారంభానికి ముందే సర్వీసింగ్‌ చేయించినప్పటికీ ఒక్కోసారి ఏసీ నుంచి సరిగా కూలింగ్‌ రాదు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం...

ఏసీ కూలింగ్‌ రావట్లేదా?

వేసవి ప్రారంభానికి ముందే సర్వీసింగ్‌ చేయించినప్పటికీ ఒక్కోసారి ఏసీ నుంచి సరిగా కూలింగ్‌ రాదు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం...

  • టెక్నీషియన్‌చేత గ్యాస్‌ ప్రెజర్‌, రిఫ్రిజిరెంట్‌ గ్యాస్‌ పరిమాణం, పైపుల నుంచి గ్యాస్‌ లీకేజీ తదితరాలను చెక్‌ చేయించాలి. లీకేజీలు ఉన్న ప్రదేశాలను సరిచేసి గ్యాస్‌ను రీఫిల్‌ చేయిస్తే సమస్య తీరవచ్చు.

  • కాయిల్స్‌ లోపలి భాగాల్లో, ఇండోర్‌ యూనిట్‌లోని ఎవాపరేటర్‌ కాయిల్స్‌లో, అవుట్‌డోర్‌ యూనిట్‌లోని కండెన్సర్‌ కాయిల్స్‌ మధ్యలో దుమ్ము, ధూళి లాంటివి చేరితే వేడి గాలి బయటికి వెళ్లలేదు. దీంతో ఏసీ కూలింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది. ఏడాదికి ఒకసారి ఏసీని డీప్‌ క్లీనింగ్‌ చేయించడం మంచిది. అలాగే నెలకోసారి ఎయిర్‌ ఫిల్టర్లను శుభ్రం చేస్తూ ఉండాలి.

  • ఏసీకి సంబంధించిన థర్మోస్టాట్‌ సెట్టింగ్స్‌ను పరిశీలించాలి. దాని సెన్సార్‌ సరిగా పనిచేస్తుందో లేదో చూడాలి. కంప్రెసర్‌ పనితీరును పరీక్షించాలి. రిమోట్‌లో ఫ్యాన్‌ మోడ్‌ లేదా డ్రై మోడ్‌ను ఆన్‌ చేసి ఉంచినా ఏసీ నుంచి కూలింగ్‌ రాదు. ఏసీని కూల్‌ మోడ్‌లో 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద సెట్‌ చేయాలి.

  • కంప్రెసర్‌ పదే పదే ట్రిప్‌ అవుతున్నా, అవుట్‌డోర్‌ యూనిట్‌ నుంచి శబ్దాలు వస్తున్నా, ఏసీ నుంచి నీళ్లు కారుతున్నా వెంటనే టెక్నీషియన్‌ను సంప్రదించాలి.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 05:10 AM