Share News

మార్కెట్‌లో కల్తీ పన్నీర్‌

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:07 AM

దేశవ్యాప్తంగా దొరికే 122 పన్నీర్‌ నమూనాలను పరీక్షించిన ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, వాటిలో 83 శాతం నమూనాలు నకిలీవని తేల్చింది...

మార్కెట్‌లో కల్తీ పన్నీర్‌

పారాహుషార్‌

దేశవ్యాప్తంగా దొరికే 122 పన్నీర్‌ నమూనాలను పరీక్షించిన ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, వాటిలో 83 శాతం నమూనాలు నకిలీవని తేల్చింది. 83% నమూనాలు నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి. 40ు పన్నీర్‌ నమూనాలు జంతువులు తినడానికి కూడా సురక్షితమైనవి కావు. భారతదేశంలో అత్యంత ఎక్కువగా నకిలీ రూపంలో దొరుకుతున్న, కల్తీ అవుతున్న పదార్థం పన్నీర్‌ ఒక్కటే! మైదా, యారోరూట్‌ పౌడర్‌, కల్తీ పాలు లేదా పాలపొడి, పామాయిల్‌, నిల్వ పదార్థాలు, యూరియాలను కలిపి నకిలీ పన్నీర్‌ను తయారుచేస్తారు. ఈ పన్నీర్‌ను తినడం వల్ల దీర్ఘకాలంలో పేగులు, కాలేయం దెబ్బతినడంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. రోడ్డు పక్కన ఫుడ్‌ స్టాల్స్‌, చిన్న చిన్న హోటళ్లు, ఈటరీలు విక్రయించే పనీర్‌ 65, పన్నీర్‌ టిక్కా లాంటి వంటకాల్లో ప్రమాదకరమైన వంటనూనెలు ఉపయోగించి తయారుచేసిన సింథటిక్‌ పన్నీర్‌ను ఉపయోగిస్తున్నట్టు పరీక్షల్లో తేలింది. కాబట్టి ఇలాంటి నాసిరకం పన్నీర్‌తో ఆరోగ్యం కుదేలవకుండా ఉండాలంటే బయట పన్నీర్‌ తినడం మానేయాలి. కల్తీ పన్నీర్‌ను కనిపెట్టడం కోసం దానికి అయోడిన్‌ను జోడించాలి. పన్నీర్‌ నీలంగా మారితే అది కల్తీదని అర్థం.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 12:07 AM