ఈ బ్రేక్‌ఫాస్ట్ వద్దు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:26 AM
ప్రతి ఇంట్లో అత్యంత సాధారణంగా తినే కొన్ని సంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్స్ ఆరోగ్యాన్ని కుదేలు చేసే కారకాలను కలిగి ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం!...
తెలుసుకుందాం
ప్రతి ఇంట్లో అత్యంత సాధారణంగా తినే కొన్ని సంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్స్ ఆరోగ్యాన్ని కుదేలు చేసే కారకాలను కలిగి ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం!
పూరి, బంగాళాదుంప కూర: దీన్ని ఇష్టపడని వారుండరు. కానీ పూరీలను నూనెలో ముంచి వేయిస్తాం. ఉపయోగించే గోధుమ పిండి, బంగాళాదుంపలు కూడా పూర్తి పిండిపదార్థాలే! ఫలితంగా రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. తిన్న తర్వాత నిద్ర మత్తు ఆవరిస్తుంది
వైట్ బ్రెడ్, బటర్, జామ్: దీన్లో పీచు శూన్యం. చక్కెర, కొవ్వు మినహా ఏమీ ఉండదు కాబట్టి తిన్న గంటకే మళ్లీ ఆకలేస్తుంది
ఇన్‌స్టంట్ నూడుల్స్: శుద్ధి చేసిన పిండి పదార్థాలు, సోడియం, రుచిని పెంచే పదార్థాలు దీన్లో ఉంటాయి. ప్రొటీన్ ఉండదు, పీచు ఉండదు కాబట్టి పేగుల మీద భారం పెరుగుతుంది
కూరగాయలు లేని ఉప్మా: సాదా రవ్వకు నెయ్యి జోడించి ఉప్మా వండుకుని తింటే, దాన్లో ఒంటికి దక్కే పోషకాలు శూన్యం. కూరగాయలు జోడించని ఉప్మా తినడం వృథా. కాబట్టి బీన్స్, క్యారట్, పచ్చి బఠాణీలు జోడించి, ఉప్మా వండుకోవాలి
సిరీల్స్, పాలు: ఆరోగ్యకరమైన అల్పాహారంగా ప్రచారం పొందే ఈ బ్రేక్‌ఫా్‌స్టలో చక్కెర, శుద్ధిచేసిన పిండిపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పాలు ఒక్కటే ఈ అసమతౌల్యాన్ని సరి చేయలేదు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News